- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిచేవరకు మాస్క్ తీయనని చాలెంజ్ చేసింది.. తీరా చూస్తే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. 180కి పైగా సీట్లలో సత్తా చాటింది. విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సహా కూటమిలోని కీలక నేతలు ఓటమి దిశగా పయణిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియాచౌదరీ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవరకూ మాస్క్ తీయను అని చెప్పి మరీ ప్రచారం చేసింది. తీరా చూస్తే ఆమె ఓటమి పాలయ్యారు. దర్భంగా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావ్గీ గెలిచారు. గత ఎన్నికల్లో కూడా ఆయనదే విజయం. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు.






