బిహార్ ఫలితాలపై పవన్ కల్యాణ్ ట్వీట్

by Gantepaka Srikanth |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు.

బిహార్ ఫలితాలపై పవన్ కల్యాణ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘అభివృద్ధి, పారదర్శక పాలనకే ప్రజలు పట్టం కట్టారు.. ఈ అపూర్వ తీర్పు దేశం ఎలాంటి పాలన కోరుకుంటోందో స్పష్టం చేస్తోంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా చూపిస్తుండగా.. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ చతికిలపడిపోయింది. లాలూ ప్రసాద్‌ యాదవ్ ఇద్దరు కుమారులు కూడా వెనకంజలో కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం కొనసాగుతోన్న ఫలితాల సరళి ప్రకారం.. ఎన్డీయే 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 66 చోట్ల విజయం దక్కించుకుంది. విపక్ష మహాగఠ్‌బంధన్ 34 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా.. 5 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఖాతా తెరిచింది.

Next Story