జైలు నుంచి అసెంబ్లీకి.. బిహార్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం

by Gantepaka Srikanth |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) ఫలితాల్లో సంచలనం చోటుచేసుకుంది.

జైలు నుంచి అసెంబ్లీకి.. బిహార్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) ఫలితాల్లో సంచలనం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ సింగ్(Anant Singh) జైలు నుంచి విజయం సాధించారు. మొకామా నియోజకవర్గంలో ఆయన సత్తా చాటారు. హత్య కేసులో ఆయన జైలు పాలైనప్పటికీ మొకామా ఓటర్లు ఆయనకే ఓటేసి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారలు సేకరించిన పోలీసులు అనంత్ సింగ్‌ను పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అనంత్ సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మొకామా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, జైలుకు వెళ్లిన ఆయన గెలవడం కష్టమే అనే అనుమానాలను పటాపంచలు చేశారు. జైలు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, అనంత్‌ సింగ్‌ ఇప్పటివరకు నాలుగుసార్లు మొకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 28,206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు అనంత్ సింగ్‌పై 28 క్రిమినల్ కేసులు కూడా ఉండటం గమనార్హం.

Next Story