గుడ్డు వల్ల లాభాలు ఎన్నో…

by  |
గుడ్డు వల్ల లాభాలు ఎన్నో…
X

దిశ, వెబ్ డెస్క్:
సండే హో యా మండే రోజ్ కావ్ అండే అంటారు. నిజమే..రోజూ గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు అన్నీ..ఇన్నీ కావు.. అందుకే పోషకాహార లోపంతో బాధపడేవారు గుడ్లు తినాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే గుడ్డు తింటే మంచిది కాదనీ, కొలెస్ట్రాల్ పెరుగుతుందనీ మనలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ గుడ్డు వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే మన ఆపోహాలన్నీ తొలగిపోతాయి. అందుకే గుడ్డువల్ల కలిగే లాభాలను ఈ రోజు తెలుసుకుందాం….

నిత్యం ఓ కొడిగుడ్డును తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కోడిగుడ్ల వల్ల మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. అందుకే చిన్ప పిల్లల నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇక పోషకాహర లోపంతో బాధపడేవారు ప్రతి రోజూ ఓ గుడ్డును తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఉదయం ఆల్పాహారంతో పాటు గుడ్డును తీసుకుంటే అద్బుతమైన పలితాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

గుడ్డులో ఉండే షోషకాలు పిల్లల్లో పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. ఇక కోడి గుడ్డు తింటే కంటి చూపునకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకో గుడ్డు తినేవారిలో కంటి శుక్లాలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని వైద్యులు అంటున్నారు. ఇక డైటింగ్‌లో ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ల వల్ల ఓ గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దీంతో వారు ఎక్కువ ఆహారం తీసుకోకుండా గుడ్డు చేస్తుంది. ఇక గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుంచి సమాచార రవాణాను మెరుగు పరచడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.

గుడ్లు అధికంగా తినే వారికి గుండె జబ్బులు వస్తాయనే అపోహ చాలా మందిలో ఉంది. వాస్తవంగా గుడ్లు అధికంగా తినేవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డు తినడానికి, కొలస్ట్రాల్ పెరగడానికి సంబంధం లేదని అధ్యయనాల్లో తెలిసింది. ముఖ్యంగా రోజుకు రెండు గుడ్లు తినేవారిలో లిపిడ్స్ లో ఎలాంటి మార్పు రాలేదని పరిశోధకులు గుర్తించారు.


Next Story

Most Viewed