- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూజీసీ నెట్ ఆన్సర్ కీ విడుదల.. NTA రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డిసెంబర్ 2025 సంవత్సరానికి సంబంధించిన UGC-NET ఆన్సర్ కీని నిన్న(జనవరి 15) విడుదల చేసింది.

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డిసెంబర్ 2025 సంవత్సరానికి సంబంధించిన UGC-NET ఆన్సర్ కీని నిన్న(జనవరి 15) విడుదల చేసింది. ఎన్టీయే 85 సబ్జెక్టులకు గానూ డిసెంబర్ 31 నుంచి జనవరి 7వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలక ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్ తాత్కాలిక ఆన్సర్ కీతో పాటు, అధికారం యూజీసీ నెట్ రెస్పాన్స్ షీట్‌ను కూడా విడుదల చేసింది. రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ రెండింటినీ ఉపయోగించి, అభ్యర్థులు పరీక్షలో వారి పనితీరు స్థాయిని అంచనా వేయవచ్చు. యూజీసీ నెట్ తాత్కాలిక సమాధాన కీ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను, అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్(కాప్చా) నమోదు చేయాలి. ఆన్సర్ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 17 వరకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్టీయే పేర్కొంది. ఫిర్యాదులను సమర్పించడానికి అభ్యర్థులు ప్రతి అభ్యంతరానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ ను సందర్శించండి.






