UGC NET-2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-22 09:24:10  IST  )

యూజీసీ నెట్ అనేది(UGC NET) ఎన్టీయే ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే ఒక జాతీయ స్థాయి పరీక్ష.

UGC NET-2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: యూజీసీ నెట్ అనేది(UGC NET) ఎన్టీయే ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే ఒక జాతీయ స్థాయి పరీక్ష. దీనిని జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF​) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పీహెచ్​డీ ప్రవేశం, కేవలం పీహెచ్​డీకి ప్రవేశం కోసం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డ్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఈ నెల(జూన్) 25 నుంచి 29వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో జరుగుతుంది. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేయాలి.

Next Story