SSC GD కానిస్టేబుల్‌ ఫైనల్‌ స్కోర్‌కార్డ్‌ రిలీజ్.. డౌన్‌లోడ్ ఇలా!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-02 13:14:04  IST  )

SSC GD కానిస్టేబుల్‌(SSC GD Constable) ఫైనల్ పరీక్ష(Final EXam) గత ఏడాది(2024)కి సంబంధించిన స్కోర్‌కార్డ్‌లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

SSC GD కానిస్టేబుల్‌ ఫైనల్‌ స్కోర్‌కార్డ్‌ రిలీజ్.. డౌన్‌లోడ్ ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: SSC GD కానిస్టేబుల్‌(SSC GD Constable) ఫైనల్ పరీక్ష(Final EXam) గత ఏడాది(2024)కి సంబంధించిన స్కోర్‌కార్డ్‌లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 48,891 మంది మహిళలు.. 39,375 మంది పురుష అభ్యర్థులు ఎంపికైనట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. అస్సాం రైఫిల్స్ పరీక్ష 2024లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), SSF, రైఫిల్‌మ్యాన్ (GD)లో కానిస్టేబుల్ (GD) తుది ఫలితాలు గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా రిలీజైన ఫలితాల ప్రకారం మొత్తం 48,891 మంది మహిళా అభ్యర్థులు, 39,375 మంది పురుష అభ్యర్థులు వివిధ పోస్టులకు ఎంపికయ్యారు. ఈ తరుణంలో ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన వివరణాత్మక మార్కులను తదుపరి దశలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని SSC కమిషన్ (Staff Selection Commission) పేర్కొంది. ఈ స్కోర్‌కార్డులను అధికారిక https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇలా డౌన్‌లోడ్ చేయండి..

*ssc.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

*హోమ్‌పేజీలో, SSC GD కానిస్టేబుల్ 2025 ఫలితం(or) తుది మార్కుల లింక్‌ను కనుగొనండి.

*మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్‌ను, కాప్చా నమోదు చేయండి.

*SSC GD కానిస్టేబుల్ ఫైనల్ మార్కుల లింక్‌పై క్లిక్ చేయండి.

*ఫైనల్ మార్కులు తెరపైకి వస్తాయి.

*భవిష్యత్ అవసరాల కోసం స్కోర్‌కార్డ్ ప్రింట్ తీసుకోండి.

Next Story