- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET UG ఫలితాల్లో సంచలనం.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇతడే.. టాప్ 10 అభ్యర్థుల లిస్ట్!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మే 4వ తేదీన నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) UG 2025 ఫలితాలను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మే 4వ తేదీన నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) UG 2025 ఫలితాలను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో 22,06,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 9.65 లక్షల మంది పురుష అభ్యర్థుల ఉంటే 13.1 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 22 లక్షల మంది నీట్ రాయగా 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. OBC-9.4 లక్షలు, అన్‌రిజర్వ్‌డ్-6.89లక్షలు, ఎస్సీ-3.3లక్షలు, EWS-1.5లక్షలు, ఎస్టీ-1.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు.
అయితే నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR)ని సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా మరియు మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి ఉన్నారు. హనుమాన్‌గఢ్ నివాసి అయిన కుమార్, సికార్‌లో ఉంటూనే నీట్‌కు సిద్ధమయ్యాడు. ఇక, టాప్ 10 ర్యాంకుల్లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. ఇక, టాప్-10 ర్యాంకర్లందరూ జనరల్ కేటగిరీకి చెందిన వారేనని ఎన్టీయే వెల్లడించింది. అందులో ఒకే ఒక అమ్మాయి(అవికా అగర్వాల్) ఉన్నారు.
టాప్ 10 ర్యాంకర్ల జాబితా..






