- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Entrance Exams: విద్యార్థులకు అలర్ట్.. అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) విడుదల చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) విడుదల చేసింది. ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, లా, ఎడ్యుకేషన్, ఫార్మసీ, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG Common Entrance Tests – 2026 (TG CETs–2026) తేదీలను అధికారికంగా ప్రకటించింది.
మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్
ఈ షెడ్యూల్ ప్రకారం.. మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, అలాగే మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. మే 12న ఎడ్‌సెట్ (TG EDCET), మే 13, 14 తేదీల్లో ఐసెట్ (TG ICET) నిర్వహించనున్నారు. అలాగే మే 15న టీజీఈసెట్ (TG ECET), మే 18న లాసెట్ (TG LAWCET) మరియు పీజీ లాసెట్ (PGLCET) పరీక్షలు జరుగుతాయి.
మే 28 నుంచి 31 వరకు పీజీఈసెట్
అదే విధంగా మే 28 నుంచి 31 వరకు పీజీఈసెట్ (TG PGECET), మే 31 నుంచి జూన్ 3 వరకు పీఈసెట్ (TG PECET) పరీక్షలు నిర్వహించనున్నట్లు TGCHE వెల్లడించింది. ఈ అన్ని ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానం (CBT) లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. విద్యార్థులు ముందుగానే పరీక్ష తేదీలను తెలుసుకుని చదువు ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు TGCHE తెలిపింది. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు ఫీజు వివరాలు సంబంధిత కన్వీనర్లు త్వరలో ప్రకటించనున్నారని వెల్లడించింది.






