జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదల

by Ajay Maddhiboyina |

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ అధికారులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18 జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ అధికారులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు రెండవ షిఫ్ట్ నిర్వహించారు. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. కాగా తాజాగా ఈ పరీక్ష రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ ని మే 26న విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెకండరీ కీ ని జూన్ 2న విడుదల చేయనున్నారు.

Next Story