- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Alert:ఈ పోస్టులకు అప్లై చేశారా?.. ఎల్లుండే లాస్ట్ డేట్

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల(Jobs) కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇటీవల పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ(India Post Office) లో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకు గాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయో సడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది. పూర్తి వివరాల కోసం ఈ India Post అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దరఖాస్తు విధానం..
*అభ్యర్థులు https://indiapostgdsonline.cept.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
*దరఖాస్తు సమర్పణకు ముందు వన్-టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
*అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలి.
*06.03.2025 నుంచి 08.03.2025 వరకు తప్పులు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.