గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్!

by Jakkula.Mamatha |

ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త వచ్చింది.

గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టైలర్, కార్పెంటర్, ప్లంబర్, బార్బర్, స్వీపర్, ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్లలో 3,588 జాబ్స్ భర్తీ చేయనుంది. ఇందులో మెన్ 3406, ఉమెన్స్ 182 కేటాయించింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాసై ITI సర్టిఫికేషన్ ఉన్నవారు అర్హులు గా ప్రకటించింది.

అభ్యర్థులు ఈ నెల(జులై) 26 నుంచి ఆగస్టు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bsf.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Next Story