- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 764 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. 764 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులు 561 ఉన్నాయి. టెక్నీషియన్-ఏ లో 203 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్‌కు పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400-రూ.1,12,400 జీతం ఉంటుంది. టెక్నీషియన్-ఏకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 28 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 11వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇతర వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.drdo.gov.inను సందర్శించండి.






