- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్, ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి!
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామాల్లో నివసిస్తున్న పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసై ఏ ఉద్యోగం లేని యువతీ, యువకులకు ఫ్రీగా కంప్యూటర్, సోలార్ సిస్టమ్ ఇన్ స్టలేషన్ అండ్ సర్వీస్ కోర్సులు చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ చైర్మన్ తెలిపారు.
అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ) మూడున్నర నెలలు ఉచిత శిక్షణ ఇస్తారు. దీనికి బి.కామ్ పాస్ అయిన వారు అర్హులు గా పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన వారికి కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్ మూడున్నర నెలలు ఉచిత శిక్షణ, హస్టల్ భోజన వసతి కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే టెన్త్, చదివిన వారికి సోలార్ సిస్టమ్ ఇన్ స్టలేషన్ అండ్ సర్వీస్ లో మూడున్నర నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజన వసతులు కల్పించి.. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం కూడా ఇప్పిస్తామని వెల్లడించారు. ఆటో మొబైల్-2 వీలర్ సర్వీసింగ్ కోర్సులో ఫ్రీ ట్రైనింగ్‌కు కూడా పదోతరగతి పాసైన వారు అర్హులుగా పేర్కొన్నారు.
ఈ మేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. దీనికోసం అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి. అలాగే గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కాదని తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాటి జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం, జలాల్ పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ సంస్థకు రావాల్సిందిగా సూచించారు. పూర్తి వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.






