ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

by Gantepaka Srikanth |

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ విద్యార్థుల కోసం ఏపీ విద్యాశాఖ(AP Education Department) కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుచెల్లించడానికి ఆఖరు తేదీని పొడిగించింది. ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.1,000 ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో ఉంటాయి. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని.. పండుగల్లో సెలవుల దృష్ట్యా అవసరమైతే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే.

Next Story