- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు అలర్ట్.. IBPS RRB PO ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అవుట్!
బ్యాంకింగ్ రంగంలో ఐబీపీస్ ఆర్ఆర్బీ పీవో పోస్టులకు అప్టై చేసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలో ఐబీపీస్ ఆర్ఆర్బీ పీవో పోస్టులకు అప్టై చేసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 3,928 RRB PO పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో IBPS RRB PO(ఆఫీసర్ స్కేల్-1) ప్రిలిమ్స్ పరీక్ష త్వరలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ను సందర్శించండి. అనంతరం తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించడం ద్వారా హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల(నవంబర్) 22, 23 తేదీల్లో జరగనుంది. మొత్తం 3,928 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి రానున్నాయి.






