అభ్యర్థులకు అలర్ట్.. UGC NET-2025 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-19 04:48:46  IST  )

యూజీసీ నెట్-2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది.

అభ్యర్థులకు అలర్ట్.. UGC NET-2025 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: యూజీసీ నెట్-2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. UGC-NET పరీక్ష ప్రధానంగా భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం నిర్వహించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) UGC-NET డిసెంబర్ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. UGC-NET(2025) పరీక్షలు ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు ఎన్టీయే అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ప్రతి సబ్జెక్ట్‌కు వేర్వేరు తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ తరుణంలో అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించిన తేదీని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. ఈ క్రమంలో UGC-NET పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా NTA అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. ఇక, ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. షిఫ్ట్‌ల ప్రకారం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Next Story