ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు.. ఉచిత వసతి, విద్యతోపాటు శిక్షణ

by Disha Web Desk 17 |
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు.. ఉచిత వసతి, విద్యతోపాటు శిక్షణ
X

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని మొత్తం 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు 7,8,9 తరగతుల్లో మిగిలిన బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ ఉంటుంది. అర్హులైన గిరిజన, ఆదివాసి, సంచార, పాక్షిక సంచార, డి నోటిఫైడ్ ట్రైబ్స్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

ప్రవేశాల వివరాలు: తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు ఆరు నుంచి 9వ తరగతి ప్రవేశాలు.

సీట్ల వివరాలు:

ఆరో తరగతిలో 60 సీట్లు ఉంటాయి. మొత్తం 23 విద్యాలయాల్లో 1,380 (బాలురు -690, బాలికలు- 690) సీట్లున్నాయి.

ఏడో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు 26 (బాలికలు -18, బాలురు-8)

8వ తరగతిలో 103(బాలికలు - 55, బాలురు- 48)

9వ తరగతిలో 104 (బాలికలు -59, బాలురు 45) సీట్లున్నాయి.

అర్హతలు: 6,7,8,9 తరగతుల ప్రవేశాలకు విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో వరుసగా 5,6,7,8 తరగతులలో ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షన్నర (పట్టణ ప్రాంతం)/రూ. లక్ష (గ్రామీణ ప్రాంతం)కు మించరాదు.

వయసు: (మార్చి 31, 2023 నాటికి)

6వ తరగతికి 10 నుంచి 13 ఏళ్లు.

7వ తరగతికి 12 నుంచి 15 ఏళ్లు.

8వ తరగతికి 13 నుంచి 16 ఏళ్లు.

9వ తరగతికి 14 నుంచి 17 ఏళ్ల మధ్య ఉండాలి.

దివ్యాంగులకు 2 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా..

దరఖాస్తు ఫీజు: రూ. 100 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 20, 2023

వెబ్‌సైట్: https://fastses.telangana.gov.in


Next Story