గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు కొత్త యాప్

by Jakkula.Mamatha |

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.

గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు కొత్త యాప్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సులభమైన మార్గాన్ని ఎస్‌ఎస్‌సీ బోర్డు తీసుకొచ్చింది. ఈ క్రమంలో SSC నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇక పై తమ మొబైల్‌లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం సరికొత్త యాప్‌ను బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బోర్డు నిర్వహించే అన్ని పరీక్షలకు అప్‌గ్రేడ్ చేసిన ‘mySSC’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని SSC చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఇంటర్నెట్ సెంటర్స్, ఏజెంట్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు. యాప్‌లోనే ఆధార్, ఫేస్అథెంటికేషన్ పూర్తి వివరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.

Next Story