Government:పోలీసు ఉద్యోగాల్లో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్

by Jakkula.Mamatha |

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Government:పోలీసు ఉద్యోగాల్లో అగ్నివీరులకు 20 శాతం రిజర్వేషన్
X

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా అగ్నివీర్ సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళంలో నియమకాలు చేపట్టారు. సైనికుడిగా వారి పదవీకాలం 4 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ క్రమంలో అగ్నీవీర్‌కు సంబంధించిన తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(UP Government) కీలక నిర్ణయం తీసుకుంది.

అగ్నివీరులకు పోలీస్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకంలో భాగంగా 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కానిస్టేబుల్ పోలీస్, కానిస్టేబుల్ PAC, మౌంటెడ్ పోలీస్, ఫైర్ మ్యాన్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది(2026)లో ఫస్ట్ బ్యాచ్ రిక్రూట్మెంట్ జరగనుంది. జనరల్, SC, ST, OBC అభ్యర్థులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. వీరికి మూడేళ్ల వరకు వయో సడలింపు ఉండనుంది.

Next Story