విద్యార్థుల హామీలను నెరవేర్చారా?

by Ravi |   (  Updated:2025-12-09 00:30:48  IST  )

తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలి, మార్పు రావాలంటూ నినదించి సబ్బండ వర్గాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన

విద్యార్థుల హామీలను నెరవేర్చారా?
X

తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలి, మార్పు రావాలంటూ నినదించి సబ్బండ వర్గాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేశామని ప్రజాపాలన- విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. కానీ విద్యా ర్థులకు ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? యువ కులకు సంబంధించి యువ వికాసం పేరుతో విద్యార్థు లకు 5 లక్షల భరోసా కార్డు వడ్డీ రహితంగా ఇస్తామని ప్రకటించింది. ఇక విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, ఉన్నత విద్య చదువుకునే ప్రతి విద్యార్థికీ ల్యాప్ టాప్, ప్రతి విద్యార్థి ఇంటికీ ఉచిత ఇంటర్ నెట్, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు, బడ్జెట్‌లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని, యూనివ ర్సిటీలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధక విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హమీనిచ్చారు. కానీ అందులో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా విద్యకు 7% నిధులు దాటలేదు. ఇక రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి దరఖాస్తుల స్వీకరించి ఇప్పటి వరకు అది ఏమైందో కూడా ప్రకటించడం లేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండటంతో విద్యారంగ హామీలకు ముందడుగు పడుతుందని అందరం సంతోషపడి నప్పటికీ ఆ హామీల అమలులో జాప్యం జరుగుతోంది. నేటికీ కనీసం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు పూర్తిగా విడుదల చేయలేదు. విద్య ప్రాథమిక హక్కు. అలాంటి విద్యారంగంపై ఇచ్చిన హామీల అమలు చేయకుండా ప్రజాపాలన వారోత్సవాలు ఎలా చేస్తారు? ఇప్పుడైనా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి. సీఎం చొరవ తీసుకొని విద్యారంగంపై సమీక్షించి ఎన్నికల హామీల అమలుకు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

-కసిరెడ్డి మణికంఠ రెడ్డి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

75695 48477

Next Story