- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంభమేళాపై కడుపు మంట దేనికి?
ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. 144 సంవత్సరాల అనంతరం

ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. 144 సంవత్సరాల అనంతరం జరుగుతున్న ఈ మహోత్సవం పై ప్రపంచ ప్రజలందరికీ సానుకూల దృక్పథం ఉంది. కానీ, పని గట్టుకుని హిందూ ఆధ్యాత్మిక విలువలను, ఉత్సవాలను, ఆచార సాంప్రదాయాలను దూషించే, కాంగ్రెస్ నాయకులకు ఈ కుంభమేళా చాలా కోపాన్ని తెప్పించింది. ఆ కోపాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే నోటి ద్వారా ప్రదర్శించడం రాజకీయ వ్యూహాల్లో ఒక భాగమే. "గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా?"అనే ప్రశ్నలో భారతీయతపై ఆయనకుండే వ్యతిరేకతను స్పష్టీకరించింది.
భారతీయత అంటే ఏమిటో ప్రపంచ దేశాల ప్రజలకు తెలియజేయడానికి దగ్గరి దారిని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంఘమంలో జరుగుతున్న ఈ మహా కుంభమేళా ప్రత్యక్షంగా చూపుతుంది. ఆధ్యాత్మిక పరిపక్వత సాధన లో నిమగ్నమైన నాగ సాధువులు ఈ కుంభమేళాకు తరలి రావడం, విపరీతమైన చలిలో పుణ్య స్నానాలు చేయడం, కేవలం విభూతి ధారణతో సంచరించడం భారతీయ ఆధ్యాత్మికతకు పరాకాష్టగానే భావించాలి. జాతి, కుల, మత, దేశీయ, విదేశీయ వైవిధ్యాలను పక్కన పెట్టి, ఈ కుంభమేళాలో అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సవాలతో పాల్గొనడం ప్రపంచ దేశాలలోని ఆలోచనా పరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.
బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనలేక..
ఇక ఈ మహాకుంభమేళాకు ప్రతిరోజు లక్షల వారిగా భక్తులు రావడం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో దేశ, విదేశాల నుండి వచ్చే భక్తుల నుండి యోగి ప్రభుత్వం ప్రశంసలు అందుకోవడం హిందూ వ్యతిరేక హిందువులకు కంటగింపుగా మారింది. అందుకే నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తి ద్వారా హిందుత్వాన్ని దునుమాడాలని కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ఆ పార్టీ బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక హిందుత్వాన్ని, హిందుత్వ విలువలను, హిందువుల ఆచార వ్యవహారాలను దూషిస్తే సరిపోతుందా? వారికి ఎంతసేపూ ముస్లిం, క్రైస్తవ ప్రజల మనసులను గెలుచుకోవాలనే వ్యూహం. అందుకే పై రెండు మతాల ఆచరణల విషయంలో ఏమి మాట్లాడకుండా కేవలం హిందూత్వ ఆధ్యాత్మిక విషయంలోనే విమర్శిస్తారు.
ఎంత విమర్శిస్తే అంత నష్టం!
ఇక హిందుత్వాన్ని, హిందువుల ఆచార సాంప్రదాయాలను ఎంత ఎక్కువగా దునుమాడితే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంత బలహీన పడిపోతుంది. ఇక హిందు త్వమే ప్రధాన అజెండాగా, జాతీయవాదంగా ఎంచుకున్న బీజేపీని రాజకీయంగా ఎన్నటికీ ఎదుర్కోలేదు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక హిందుత్వాన్ని, హిందుత్వ విలువలను, హిందువుల ఆచార వ్యవహారాలను దూషి స్తుంది. ఈ విషయంలో హిందువులు సంయమనం పాటించకుండా, హింసోన్మాదులైతే పరిస్థితి ఎలా ఉం టుందో హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయ కులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి.
ఆర్ఎస్ఎస్ సేవాభావంపై మాట్లాడరేం?
ఇక మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోవడానికి నిర్వహణ లోపంగా పరిగణించడానికి వీలులేదు. ఈ విషయాన్ని భారతదేశంలోని ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2024 హజ్ యాత్ర సందర్భంగా 1301 మంది ఎండ వేడిమికి తాళలేక చనిపోయిన విషయాన్ని మన దేశం మీడియా ఎక్కడా చూపించలేదు. 16,000 మంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కార్యకర్తలు నిర్విరామంగా మహా కుంభమేళాలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, పనిచేస్తున్నారు. ఈ దేశం నాది అనే భావన ఉన్న వ్యక్తులకు మాత్రమే వారి సేవాభావం అర్థమవుతుంది. అన్యులకు ఎప్పటికీ అర్థం కాదు!
ఉల్లి బాలరంగయ్య
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






