- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగ్జిట్ పోల్స్ ఎందుకు విఫలమయ్యాయి.. బిహార్ ఫలితాలు లేవనెత్తిన ప్రశ్నలు..
బిహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. దేశ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఊహించిన దానికంటే కొంత భిన్నంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలను లేవనె త్తాయి. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన

బిహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. దేశ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఊహించిన దానికంటే కొంత భిన్నంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలను లేవనె త్తాయి. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆరు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చగా, వీటి అంచ నాలను తలకిందులు చేస్తూ, ఎన్డీయే కూట మి 243 సీట్లకు 202 సీట్లు సాధించడం, ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లతో ఢీలా పడిపోవడం ఈ దేశ రాజకీయ విశ్లేషకు లను ఆశ్చర్య చకితులను చేసింది.
మోడీని నిరంతరం వ్యతిరేకించే మేధావులను, అమెరికన్ డీప్ స్టేట్ వ్యూహాలను అమలు చేసేవారిని ఈ ఎన్నికల ఫలితాలు మరింత నిరాశ, నిస్పృహలకు గురిచేశాయి. జేడీయూ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కూటములను మార్చి మార్చి జతకట్టడంలో ఆయన దిట్ట. అయితే, ఆయన ప్రభుత్వంపై ప్రజలకు కొంత వ్యతి రేకత ఉండవచ్చు కానీ ఆయన పరిపాలన విధానాలను దగ్గరుండి చూసిన వారికి ఆయన సుశాసన్ బాబే! ఈ నమ్మకమే నాలుగవసారి అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి దోహద పడిందంటే అతిశయోక్తి కాదేమో. నూట ఒక్క సీట్లకు పోటీ చేసి 85 సీట్లు సాధించడం మామూలు విషయం కాదు.
కలిసొచ్చిన ముస్లిం- యాదవ ఫార్ములా..
దేశంలో అనేక రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఒక పార్టీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ రెండుసార్ల కంటే ఎక్కువ అధికారంలో ఉండలేదు. అలాంటిది హింస, దౌర్జన్యం కుల ఘర్షణలు, మత ఘర్షణలకు బిహార్ పెట్టింది పేరు. అటువంటి రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ఎటువంటి అవినీతి, బంధుప్రీతి మరకలు అంటకుండా పరిపాలన చేయడం ఆషామాషీ విషయం కాదు. బీజేపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా, కూటమి ప్రభుత్వంలో కొనసాగినా బాధ్యతాయుతంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని దేశ హితైషుల అభిప్రాయంగా మనం భావించాలి. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోవడం చేతగాని కొంతమంది మేధావులు ఎన్నికల ఫలితాలపై తప్పుడు విశ్లేషణ చేయడం మొదలు పెట్టారు. ఓట్లు, సీట్లు, ఎన్నికల కమిషన్ అంటూ విశ్లేషించడం మొదలెట్టారు.
ఉద్యోగ హామీ కాదు.. నగదు జమ కావాలి!
ఇక దేశ రాజకీయ పార్టీల భావజాలాలను విశ్లేషిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకు ముస్లిం ఓటర్లు ముఖం చాటేస్తారనేది అక్షర సత్యం. కానీ ముస్లిం- యాదవ్ ఫార్ములా బిహార్‌లో ఎప్పటికీ పనిచేస్తోంది. ఇక ఎన్నికల ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా యోజన కింద పదివేల రూపాయల నగదును మహిళల అకౌంట్‌లోకి జమ చేయడం కలిసి వచ్చిన విషయమని కొంతమంది విశ్లేష కులు తేల్చారు. ఎన్నికల ఉచిత హామీలలో మహాగఠ్‌బంధన్.. ఎన్డీఏ కూటమికి ఏమీ తీసిపోలేదు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే హామీ కంటే, సంవత్సరానికి రూ.10,000 ఇవ్వడం ఎక్కువ ప్రభావం చూపుతోందా?
ఓటింగ్ పెరగడం వెనక..
ఇక ఈ ఎన్నికల్లో ఓటు శాతం పెరగడం వెనుక ఎవరు ఉన్నారనే విషయం చాలామందికి అర్థం కాదు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయవాద సంస్థల కార్యకర్తలు దాదాపు లక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని చైతన్యపరిచారు. సాధారణంగా సామాన్య ప్రజలు ఓటింగ్ బూతుకు వచ్చి ఓటును సద్వినియోగం చేసుకుంటారు. విద్యావంతులు, ఉన్నత వర్గాల వారు ఓటుకు దూరంగా ఉంటారు. ఈసారి బిహార్‌లో ఈ పరిస్థితి మారింది. ఉచిత హామీల అమలు కంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలని రాష్ట్ర హితాన్ని కోరే ప్రజలు ఓటింగ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. పైగా జాతీయవాద భావజాలం దేశంలో పెరుగుతున్న తరుణంలో బిహార్ ఓటర్లు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. సర్ ప్రక్రియ ద్వారా అక్రమ వలసదారుల ఓట్ల బెడద ఈ ఎన్నికలలో ప్రభావం చూపలేదు.
పశ్చిమబెంగాల్‌పై ప్రభావం చూపుతుందా?
ఇక హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయింది అనే వాదన కూడా తప్పే. బిహార్‌లో ఎన్డీయే అఖండ విజయం పశ్చిమబెంగాల్ ఎన్నికలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెప్పే అభిప్రాయాలు నిజం కాకపోవచ్చు! బిహార్ పరిస్థితులు వేరు. పశ్చిమ బెంగాల్ పరిస్థితులు వేరు. ఆ రాష్ట్రంలో అక్రమ చొరబాటుదారులను సక్రమ భారతీయులుగా మార్చడంలో కమ్యూ నిస్టులు, కాంగ్రెస్ వాళ్లు, టీఎంసీ వాళ్లు సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నికల్లో అక్రమ చొరబాటుదారుల ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే ఈ వాస్తవం బయటపడుతుంది.
-ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






