- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొడ్డి కొమురయ్య వారసత్వానికి గౌరవమేది?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వారసత్వాన్ని గౌరవించడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవ కమిటీలు, కురుమ భవన నిర్వహణలో కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్లు బలపడుతున్నాయి.

దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో చిరస్మరణీయుడు. నిజాం రజాకార్లకు ఎదురు నిలిచి ఆయన చేసిన త్యాగం తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. ఆయన పోరాటం మొత్తం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. ఇంతటి మహనీయుడి వారసత్వాన్ని గౌరవించడంలో, ఆయన సామాజిక వర్గా నికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే సంస్థల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతులను నిర్వహించేందుకు రాష్ట్ర కురుమ సంఘం, ప్రభుత్వం ముందుకు రావడం స్వాగతించదగ్గ విషయం. అయితే, ఉత్సవ కమిటీలో కొమురయ్య కు టుంబ సభ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం విమర్శ లకు దారితీస్తోంది. ఆయన వారసులను సాధారణ సభ్యు లుగా పరిమితం చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిని విస్మరించడం వెనుక ఉన్న వ్యూహమేంటి? సాయుధ పోరాటంలో త్యాగాలు చేసిన కుటుంబానికి సముచిత గౌరవం ఇవ్వాలన్న సోయి మన సంఘా నికి ఉండొద్దా? అనే విమర్శలు వస్తున్నాయి. ఇక దొడ్డి కొమురయ్య పేరుతో కోకపేటలో కురుమ భవనం నిర్మించడం అభినందనీయం. అయితే, ఇక్కడ కూడా భవన నిర్వహణ కమిటీ లేదా ట్రస్టులో ఆయన కుటుంబ సభ్యులకు స్థానం కల్పించకపోవడం, శిలాఫలకంలో వారి పేర్లు లేకపోవడంపై విమర్శలకు దారితీస్తోంది. కొంత మంది నేతలు సంఘాన్ని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన వారసత్వాన్ని గౌరవించాలంటే కొన్ని కీలక చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవ, భవన కమిటీలలో ఆయన కుటుంబ సభ్యులకు కీలక బాధ్యతలు ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా జయం తి–వర్ధంతులను నిర్వహించడం, పాఠ్యపుస్తకాల్లో చరిత్ర చేర్చడం, ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు, మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌కు, ఉస్మా నియా యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్ర కురుమ సంఘం స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండి, కొమురయ్య ఆశయాలకు తగిన గౌరవం ఇవ్వాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.
- ముత్త సంపత్ కురుమ
94416 51280






