- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా వ్యవస్థలో మార్పులు ఎప్పుడు?
కాలానుగుణంగా మార్చుకోవాల్సిన విద్యావ్యవస్థ బూజుపట్టిపోయి ఉంది. దీనిని మారుస్తున్నాము, మారుస్తాము అని చెప్తున్న నాయకులు

కాలానుగుణంగా మార్చుకోవాల్సిన విద్యావ్యవస్థ బూజుపట్టిపోయి ఉంది. దీనిని మారుస్తున్నాము, మారుస్తాము అని చెప్తున్న నాయకులు వారు మారిపోతున్నారే కానీ ఈ వ్యవస్థలో మార్పులు, చేర్పులు లేవు. వచ్చే భవిష్యత్తు అంతా సాంకేతికమయమే, ప్రతి సాంకేతికం ఒక మెరుపు, లాంటిది. మరి అలాంటి మెరుపులపై విద్యార్థులకు అవగాహన కలిపించకపోతే అందరి వద్ద సర్టిఫికెట్స్ మాత్రమే ఉంటాయి కానీ చదువు పట్ల, సాంకేతికత పట్ల పట్టు ఉండదు. ఇది ఎప్పటికి మారుతుందో? అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రతి తల్లిదండ్రుల కోరిక పిల్లలు ఉన్నతంగా ఎదగాలి అనే తాపత్రేయం, అందుకు అనుగుణంగానే ఆకర్షణంగా తయారైన విద్యాసంస్థల పైననే మక్కువ చూయిస్తున్నారు.. కానీ ఎంత వరకు వారి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటున్నారు? వారు ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనేది చూడడం లేదు. దీనిని ప్రభుత్వం కూడా వదిలేస్తుంది. ఇందులో నష్టపోయేది విద్యార్థులే. అటు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆ ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు చెప్పినట్టు సిలబస్ పూర్తి చేయాలనే నిబంధనతో పూర్తి చేస్తారు, వాళ్లకు చదువు వచ్చిందా లేదా అనేది కూడా అనవసరం, చదువుతో పాటు బాధ్యతలను నేర్పించాలనే విషయాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడో మర్చిపోయారు, వాళ్లకు ఉండే మానసిక వత్తిడి వలన, కేవలం బట్టి పట్టించడం, పుస్తకాలలో ఉన్నది మెదడులో ఎక్కించడం అంతవరకే చేస్తున్నారు. వాళ్లకి పిల్లలలో ఎలాంటి నైపుణ్యం ఉంది, ఎలాంటి ప్రవర్తన ఉంది అనేది ఏది కూడా అవసరం లేదు, కేవలం పుస్తకాలు పూర్తి చేశామా లేదా అనేది మాత్రమే చేస్తున్నారు, ఇలానే ఉంటే విద్యార్థులు కొత్తగా ఏం నేర్చుకుంటారు? ఎప్పుడు మారుతుంది ఈ విద్యావ్యవస్థ? ఇప్పటికైనా విద్యావ్యస్థలో తీవ్రమైన సమూల మార్పులు రాకపోతే పాఠశాలలు మాత్రమే ఉంటాయి. భావి భారత నిర్మాతలు అని పిలువబడే పౌరులు ఉండరు..
-డాక్టర్. వై. సంజీవ కుమార్,
9493613555.






