- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నివేదన:ఉద్యోగ భద్రత వారికేది?
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలలో పని చేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీరు పదిహేను

ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన PRC గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ టీచర్స్ కు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకీ అమలైంది. G.O. No 16 and G.O. No 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించవలసి ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల బేసిక్ పే వేతనాలను పార్ట్ టైమ్ ఉద్యోగులకు వర్తింపజేయడం తో పాటు 30 శాతం PRC ని అందించాలి.
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలలో పని చేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీరు పదిహేను సంవత్సరాలుగా రెగ్యులర్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఏమాత్రం తక్కువగా కాకుండా సమానంగా పని చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, గురుకుల విద్యాలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినా వీరికి అతి తక్కువ వేతనం రూ.14000 మాత్రమే లభిస్తోంది. దీంతో కుటుంబ పోషణలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి, రాత, మౌఖిక పరీక్షలు, డెమో క్లాస్ నిర్వహించి, అన్ని రకాల విద్యార్హతలను పరిశీలించి కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో ద్వారా పార్ట్ టైమ్ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో చాలా మంది గురుకులంలో విద్యను అభ్యసించిన పేద గిరిజన కుటుంబాలకు చెందిన వారే. తాత్కాలిక ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు, డైనింగ్ హాల్ డ్యూటీ , 2:30 గంటల నుంచి 4:00 గంటల వరకు సూపర్విజన్ స్టడీ, 4:00 గంటల నుండి 4: 30 గంటల వరకు క్లబ్ కృత్యాల నిర్వహణ, సాయంత్రం 6: 30 గంటలకు సప్పర్ డ్యూటీ, 7:30 గంటల నుండి 10: 00 వరకు నైట్ స్టడీ సూపర్‌విజిన్‌తో పాటు నైట్ స్టే , హలీ డే డ్యూటీ ఉదయం 9: 00 గంటల నుండి రాత్రి 9: 00 గంటల వరకు, హౌస్ మాస్టర్ డ్యూటీ, అనేక రకాల ఇన్‌చార్జి బాధ్యతలు సహా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 24 గంటలు పని చేస్తున్నారు. కొందరు ప్రిన్సిపాల్స్ పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ అభద్రత భావనకు గురి చేస్తున్నారు.
ప్రమాదాల పాలవుతూ
పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు గురుకుల ఆవరణలో క్వార్టర్ ఇవ్వకపోవడం వలన నైట్ డ్యూటీ తర్వాత ఇంటికి చేరే సందర్భంలో రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గురుకులంలో నాన్ టీచింగ్, పొరుగు సేవ ప్రాతిపదికన పని చేసే అటెండర్, వాచ్‌మెన్ కన్నా పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు తక్కువగా ఉండటంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు.
పేరుకే పార్ట్ టైమ్ కానీ, 24 గంటలు పని చేయిస్తూ అధికారులు పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వం పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉపయోగించుకొని, వేతన విషయంలో తీవ్ర వివక్ష చూపిస్తున్నది, శ్రమ దోపిడీకి పాలుపడుతున్నది. ఇతర గురుకుల సొసైటీ పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల వేతనాల తో పోల్చితే, గిరిజన గురుకుల పార్ట్ టైం ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని గిరిజన మంత్రి దృష్టికి తెచ్చినపుడు సానుకూలంగా స్పందించారు కానీ, ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ప్రభుత్వం చొరవ చూపాలి
ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన PRC గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ టీచర్స్ కు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకీ అమలైంది. G.O. No 16 and G.O. No 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించవలసి ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల బేసిక్ పే వేతనాలను పార్ట్ టైమ్ ఉద్యోగులకు వర్తింపజేయడం తో పాటు 30 శాతం PRC ని అందించాలి. పేద గిరిజన విద్యార్థుల భవిష్యత్ కోసం నిర్విరామ కృషి చేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించాలి.
బానోతు రఘురామ్ నాయక్
కేయూ, వరంగల్
9666739107






