దశాబ్దాల మా ఆకాంక్షను నెరవేర్చండి!

by Ravi |   (  Updated:2025-10-16 00:30:34  IST  )

రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి తమ జాతి మూలపురుషుడుగా నిత్యం ఆరాధించే

దశాబ్దాల మా ఆకాంక్షను నెరవేర్చండి!
X

రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి తమ జాతి మూలపురుషుడుగా నిత్యం ఆరాధించే వాల్మీకి బోయలు ఒక్కపుడు ఎస్టీలు (షెడ్యుల్ తెగలు)గా ఉండేవారు. వీరిని అగ్రవర్ణ పాలకులైన రాజకీయ నాయకులు కుట్రలతో బీసీ జాబితాలో చేర్చారు. ఫలితంగా వాల్మీకి బోయలు అన్ని రంగాలలో వెనుక బాటుకు గురయ్యారు. ప్రభుత్వ ఫలాలు అందక విద్య, ఉద్యోగ, రాజకీయ ఇలా అన్ని రంగాలలో వెనకబాటుకు గురై పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతూనే ఉన్నారు. ఒకప్పుడు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేసి సిటీ యాక్టుకు గురైన అడవి బిడ్డలమైన వాల్మీకి బోయలం స్వాతంత్ర్య భారతదేశంలో కూడా నిరధారణకు గురైతున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారిన వాల్మీకి బోయల దశాబ్దాల ఆకాంక్ష మాత్రం నెరవేరడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఆ బిల్లుపై స్పష్టమైన వైఖరిని తెలుపలేదు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల అభయహస్తం మేనిఫెస్టో‌లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని స్పష్టంగా తెలిపింది. గెలిచాక రేవంత్ రెడ్డి సైతం ఉమ్మడి మహాబూబ్‌నగర్‌లో జరిగిన అనేక బహిరంగ సభలల్లో, సమావేశాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు తక్షణమే దానికి సంబంధించిన ప్రక్రియను చేపడుతామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు మా సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తరాలు మారిన తలరాతలు మారలే, ప్రభుత్వాలు ఎన్ని మారినా వాల్మీకి బోయల బతుకులు మారలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వాల్మీకి బోయలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. వాల్మీకి బోయల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలి.

-మీనుగు రఘుపతి

9553808855

Next Story