సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించుకోండి!

by Ravi |   (  Updated:2025-05-30 00:31:21  IST  )

ఈ కాలంలో సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ సోషల్ మీడియా మాధ్యమాలపై

సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించుకోండి!
X

ఈ కాలంలో సోషల్ మీడియా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ సోషల్ మీడియా మాధ్యమాలపై ఆసక్తి పెరిగిపోయింది. ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, కమ్యూనికేషన్ సులభమవుతోంది. కానీ అదే సోషల్ మీడియా వాస్తవ జీవితంపై కొన్ని ప్రమాదకరమైన ప్రభావాలను కూడా చూపుతోంది. సోషల్ మీడియా వల్ల కుటుంబ సభ్యుల మధ్య మానవ సంబంధాలు బలహీనమవుతున్నాయి. దాంతో కుటుంబ అనుబంధాలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. చదువుపై మనసు కేంద్రీకరించలేకపోతున్నారు. వారి ఆశయాలపై దృష్టి తగ్గుతోంది. ముఖ్యంగా, ఇతరుల జీవితాలను చూసి, తమను తాము తక్కువగా భావించే పరిస్థితులు పెరిగిపోతున్నాయి. వారిలో అసంతృప్తి, అసూయ, అసహనం పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక ఒత్తిడి, మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇంతే. దీంతో కొన్ని సంస్థలు మొబైల్ వాడకంపై నియమాలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తప్పుడు సమా చారం వ్యాప్తి వల్ల పెద్ద ఎత్తున అపార్థాలు, కలహాలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి శాంతిభద్రతలకే ప్రమాదం కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం ఫోన్‌కు దూరంగా గడపడం, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం అవసరం. ఇక అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేయాలి. తప్పుడు వార్తలు పంచుకునే ముందు వాటిని రుజువు చేసుకొని షేర్ చేయలి. సోషల్ మీడియా మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయు ధం. దీన్ని మంచి పనులకు వాడితే ఇది గొప్ప సాధనంగా మారుతుంది. కానీ అది మన మీద ఆధిపత్యం చెలాయించటం మొదలైతే మన స్వేచ్ఛను మనం కోల్పోతాం. అందుకే, సోషల్ మీడియాను జాగ్రత్తగా, ఆలోచించి వినియోగించాలి. అదే మన బాధ్యత.

కె. కృష్ణమూర్తి

97051 96097

Next Story