వ్యాయామంలోనూ.. అవగాహన ముఖ్యం!

by Ravi |   (  Updated:2026-01-29 00:30:45  IST  )

ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉండటం. మన తాతలు, తండ్రులు సహజ జీవన విధానం వల్ల వందేళ్ల వరకు జీవించ గలిగారు. వారు తిన్న తిండి, చేసిన పనులు ఆరోగ్యానికి హితం చేశాయి. కానీ ఆధునిక జీవన విధానం వల్ల మనం ఆరోగ్యం పట్ల ఉల్లాసం చూపడం మర్చిపోయాం..

వ్యాయామంలోనూ.. అవగాహన ముఖ్యం!
X

ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉండటం. మన తాతలు, తండ్రులు సహజ జీవన విధానం వల్ల వందేళ్ల వరకు జీవించ గలిగారు. వారు తిన్న తిండి, చేసిన పనులు ఆరోగ్యానికి హితం చేశాయి. కానీ ఆధునిక జీవన విధానం వల్ల మనం ఆరోగ్యం పట్ల ఉల్లాసం చూపడం మర్చిపోయాం. డబ్బు సంపాదనలో మునిగిపోయి, శరీరం, ఆరోగ్యం, ఆనందం, తిండి వంటి విషయాలను పట్టించుకోవడం మానేశాం. ఫలితంగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం.. తినే ఆహారం విషపూరితంగా మారింది, గాలి, నీరు కలుషితమైపోయాయి, సమయపాలనా లేదు. అందువల్ల అనారోగ్యం ఎక్కువైపోతుంది, కాబట్టి చాలామంది 40 ఏళ్లకు ముందే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఈ భయంతో కొందరు వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జిమ్, యోగా, వాకింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటి పద్ధతులలో ట్రై చేస్తున్నారు.. కానీ అవగాహన లేకపోవడం వల్ల ఫలితం లభించడం లేదు. ఉదాహరణకు, మోకాళ్ల నొప్పితో బాధపడిన వ్యక్తి డాక్టర్ సూచనతో వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ప్రయత్నిస్తే ఫలితం మోకాళ్ల నొప్పిని తగ్గించక, మరింత పెంచింది. అందుకే ఏ వ్యాయామం ఎందుకు, ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో తెలుసుకోవడం అవసరం. అందుకే ఎక్సర్‌సైజ్‌ నిపుణుల పర్యవే క్షణలోనే చేయడం సురక్షితం. పట్టణాల్లో జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు ఉన్న ప్పటికీ, అక్కడి ట్రైనర్లు సర్వత్రా సమర్థులు కారు.. కొంతమంది ట్రైనర్లు సాధారణ అవగాహనతో, ఇతరులను చూసి పద్ధతులు అమలు చేస్తారు. నిజానికి ప్రతి వ్యక్తికి అవసరానికి అనుగుణంగా వ్యాయామాలు సూచించ డం ముఖ్యం. ఉదాహరణకు, సన్నగా ఉన్నవారు ఫిట్‌నెస్ ట్రైనింగ్ మాత్రమే చేయాలి, బరువు తగ్గించుకోవాలంటే తగిన వ్యాయామాలు చేయాలి. వృద్ధులకు హేవీ వెయిట్ అవసరం లేదు, జెరియాట్రిక్, కార్డియాక్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ తగినది. అందుకోసం ఈ మధ్య కాలంలో ఫిజియో థెర పిస్టులు ఫిట్నెస్ ట్రైనింగ్ అందిస్తున్నారు. వీరు అనాటమీ, ఫిజియాలజీ, వ్యాధుల నివారణ, ఎక్సర్‌సైజ్‌ థెరపీలో నిపుణులు.. వీరు ఎక్సర్‌సైజ్‌ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకుని, వ్యక్తులకు పర్ఫెక్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ అందించగలరు. సరైన పద్ధతిలో, నిపుణుల పర్యవేక్షణలో చేసిన ఎక్సర్‌సైజ్‌ వల్ల వ్యాధుల నివారణ, ఆరోగ్య మెరుగుదల సాధ్యమే.

-డా. గోరంట్ల సత్యనారాయణ

98490 09634

Next Story