- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ జీవితం అరువు తెచ్చుకున్నది!
మనిషి జీవితం నిమిష మాత్రం" అని శ్రీశ్రీ అంటాడు. దీనర్థం జీవితం స్వల్పకాలికమైనది, మనం ఆనందంగా జీవిస్తూ

'మనిషి జీవితం నిమిష మాత్రం" అని శ్రీశ్రీ అంటాడు. దీనర్థం జీవితం స్వల్పకాలికమైనది, మనం ఆనందంగా జీవిస్తూ సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేస్తుంది. మనిషి కి చావు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఈ ప్రకృతిలో మనం ఎంతో గొప్పగా ఊహించే సమాజం క్షణా ల్లో మాయం కావచ్చు.. నేడు కృత్రిమ మేథ కొత్త సాంకేతిక ఆవిష్కరణతో ప్రపంచగతినే మార్చుతుంది. ఇది అనేక రంగాలలో ప్రవేశించాకా.. మానవ జీవన ప్రమాణాలు పెరిగాయి. మనిషుల అవసరాలు ఆశలకు మించి పెరిగిపోతున్నాయి. కానీ ఆలోచన దాటి ఈ ప్రకృతిలో జరిగే ప్రమాదాలను, కొత్తగా వ్యాధులను ఆపలేకపోతున్నాడు. కేవలం వాటి తీవ్రతను అరికట్టగలుగుతున్నాడు.. ఆశాజీవిగా బతకాల్సిన మనిషి రోజురోజుకూ అత్యాశ జీవిగా మారాడు.
ఎక్కడ ఏం జరుగుతుందో..?
ఈ అత్యాశతో మనిషి సుఖంగా జీవించలేకపోతున్నాడు. నిరంతరం మానసి సంఘర్షణతో బతుకుతున్నాడు. ఈ క్రమంలో హఠాత్తుగా సంభవించే అనేక మరణాలు, దుర్ఘ టనలు మనుషును కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆనందించేలోపే ప్రాణాలు ఆవిరైపోతున్నాయి. ఏప్రిల్ వేసవి విడిదికి జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం వెళ్లిన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. మొన్న రాయల్ చాలెంజ్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమంలో అభిమాన ఆటగాళ్లను చూసినందుకు వెళ్లిన 11 మంది విగతజీవులుగా మారారు.. నిన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మందితో పాటు 27 మంది వైద్య విద్యా ర్థులు చనిపోయారు. ఇది ఎందరో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆనందంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు ఊహించని లోకానికి వెళ్లారు.. అందరితో కలిసి భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు ముద్ద నోట్లో ఉండగానే మంటల్లో మాడిపోయారు. అసలు కను రెప్ప పాటులో జరిగే ఈ ప్రమాదాలు ఎందర్నో కలిచివేశాయి.
రేపు వస్తుందని గ్యారెంటీ లేదు..
ఈ ప్రమాదాల నేపథ్యంలో మానవుని జీవితం ఏంటని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మనం ఎలా జీవిస్తున్నామని, మన నడవడిక సరైనదేనా? అని పలువురు ఆలోచనలు చేస్తున్నారు.. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎక్స్ వేదికన రాసిన వాక్యాలు ఆలోచింపచేస్తాయి. ఎన్నో జీవి తాలు ఒక్క క్షణంలో మాయమైపోతాయి. జీవితం వాగ్దానం చేయలేదు. ఇది అరువు తెచ్చుకున్నది మాత్రమేనని గుర్తుంచుకోండి. కోపాన్ని తగ్గించుకుని అందరితో ప్రేమగా ఉండండి. ఎందుకంటే రేపు వస్తుందని హామీ లేదనే మాటలు ఈ రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నా యి. నేటి కాలంలో కులం, మతం అంటూ కొట్టుకు చస్తున్నారు. స్థితి, అంతస్తులతో మానవత్వాన్ని మరిచిపోతున్నారు.. పట్టింపు పంతాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. సామాజిక మాద్యమాలలో సగం జీవితం అయిపోతుంది. దీంతో కుటుంబం, సమాజాన్ని మరిచిపోతున్నారు.. పక్కిం టి వారెవరో కూడా తెలియని పరిస్థితి. అంత బిజీ లైఫ్‌లో మానవ సంబంధాలు రోజురోజుకూ తెగిపోతున్నాయి. దీంతో ఆనందం కూడా కరువైపోతుంది. కావున బాధ్యతగా సామాజిక సంబంధాలతో జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిపోయింది వదిలిపెట్టు, భవిష్యత్తు నీ చేతిలో లేదు అతిగా ఆలోచించి ఆందోళన చెందవద్దు.. ప్రస్తుతం మన చేతిలో ఉంది, ఆనందంగా నవ్వుతూ జీవించు.. మన జీవితాలకు మనమే బాధ్యులం.. సామాజిక శాస్త్రం అర్థం చేసుకోకపోతే సాంకేతిక శాస్త్రంలో ఆనందం కరువైపోతుంది. ఇది జీవితంలో తెలుసుకోవాల్సిన గొప్ప సైన్స్.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428






