- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌ఫ్లూయెన్సర్లూ జాగ్రత్త.. ప్రమోషన్స్ ముందు ఆలోచించండి!
నేటి సమాజం ఆధునిక పోకడ వేగంగా దూసుకపోతుంది. ఏది మంచి ఏది చెడ్డది అనే తెలియని స్థితిలోకి సమాజం వెళ్లిపోతుంది, అది నిజమా అబద్ధమా? అనేది గ్రహించడంతో విఫలం అవుతున్నారు.

నేటి సమాజం ఆధునిక పోకడ వేగంగా దూసుకపోతుంది. ఏది మంచి ఏది చెడ్డది అనే తెలియని స్థితిలోకి సమాజం వెళ్లిపోతుంది, అది నిజమా అబద్ధమా? అనేది గ్రహించడంతో విఫలం అవుతున్నారు. ఆశకు, అత్యాశకు తేడా తెలియని ఆలోచనలలో చాలామంది ఉంటున్నారు. ఎవ్వరికి వాళ్లు మేము గుర్తింపు పొందాలి, అందరి కన్నా నేనే గొప్పగా ఉండాలి అనే పోకడతో ఆలోచిస్తూ సాగుతున్నారు. అందులో భాగంగానే బెట్టింగ్‌లో డబ్బులను కోల్పోయి సర్వస్వం కోపోయినవాళ్లు ఉన్నారు, బలవర్మరణాలు తీసుకున్నవాళ్లు ఉన్నారు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినవాళ్లు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకొని ప్రమోషన్స్ చేస్తే వారి ఆకర్షణలకు లోనై బలైనవాళ్లు ఎందరో ఉన్నారు. ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకునే సమయానికి ఎవ్వరికి వాళ్లు మాకు తెలియకుండా చేశాం అని అనేస్తున్నారు. ఆ కోవలోకే వెళ్తున్నారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. వీరు ప్రజలను ప్రభావితం చేయగల వ్యక్తులు. రకరకాల కంటెంట్ సృష్టించి సమాజానికి చేరవేస్తుంటారు. కానీ వాళ్లు ప్రచారం చేసే ప్రకటనల విషయాలలో నిజం ఉందా లేదా? ప్రమోట్ చేసే వస్తువు నాణ్యమైనదా? లేదా అనేది ఆలోచించడం లేదు. వేలలో, లక్షలలో ఫాలోవర్లు ఉన్నారని రెమ్యూనరేషన్ తీసుకోని ప్రచారకర్తగా ఉంటూ ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్పింది నిజమని మిమ్మల్ని ఫాలో అయ్యి నష్టపోయిన వాళ్లకు ఎవరు సమాధానం చెప్తారు? ఎవరైనా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే మీ పరిస్థితి ఏంటి? అందుకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లూ.. మీరు సాధించున్న పేరు, విజయం నష్టపోకుండా జాగ్రత్తలు వహించండి. మీరు చేసే కంటెంట్ ఏదైనా సరే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ప్రమోషన్స్ చేయండి. మీరే కంటెంట్ కాకుండా ఉండండి. ప్రతి ఒక్క ఫాలోవర్‌కు జవాబుదారిగా ఉండండి. యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మీరు అన్ని తెలుసుకోకుండా ప్రచారం చేసి, నష్టం వచ్చాక నాకు ఏమి తెలియదు? అని అనకుండా ఉండేలా చూసుకోండి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా అప్రమత్తంగా ఉండి మంచిని ప్రమోట్ చేయండి, సమాజానికి జాగ్రత్తలు తెలియజేయండి, సమాజంలో మీకు ఉన్న గుర్తింపుని మరింత పెంచుకోండి.
-డాక్టర్. వై. సంజీవ కుమార్,
94936 13555






