యుద్ధం ఆగింది కానీ.. ఒంటరైన పాక్

by Ravi |   (  Updated:2025-05-13 00:45:26  IST  )

పాకిస్తాన్ అనే దేశం ఆవిర్భావం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ యాదృచ్ఛికమే భారత దేశ భద్రతకు ప్రమాదకరంగా మారింది.

యుద్ధం ఆగింది కానీ.. ఒంటరైన పాక్
X

పాకిస్తాన్ అనే దేశం ఆవిర్భావం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ యాదృచ్ఛికమే భారత దేశ భద్రతకు ప్రమాదకరంగా మారింది. 1947లో మతం ఆధారంగా భారతదేశంలో నుండి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని పిలువబడే ఇస్లామిక్ భూభాగాలు ప్రత్యేక దేశాలుగా ప్రపంచపటంలోకి చేరిపోయాయి. హింస, నరమేధంతో దేశాలు ఏర్పడడం అనే చారిత్రక అంశానికి ఉదాహరణలుగా ఈ భూభాగాలు నిలుస్తాయి. స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికే అంటే 1948లో పాకిస్తాన్ కశ్మీర్‌పై దాడి చేసి, వన్ థర్డ్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఆ భూభాగాన్ని మనం తీసుకోకపోవడమే మన దేశం చేసిన పెద్ద తప్పిదం.

ఆ దేశాల్లోనే ఇలా జరిగితే..

1965లో యుద్ధానికి దిగి, చావుదెబ్బ తిన్నది పాకిస్తాన్. 1999లో కార్గిల్‌లో చొరబాట్లకు తెగించి భంగపాటు పడ్డది. అయినా పాక్ పాలకులకు బుద్ధి రాలేదు. బల ప్రయోగంతో భారత్‌ను ఏమీ చేయలేం అని తెలుసుకున్న పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. దేశమంటే వ్యతిరేకించే యువతను చేరదీసి, వారికి తీవ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇప్పించి, రహస్య మార్గాల్లో భారత్‌కు పంపించి, దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా వారిని ఉపయోగించడం పాకిస్తాన్‌కి నిత్యకృత్యమైంది. వాస్తవానికి ప్రపం చంలో భారతదేశం ఎదుర్కొన్నన్ని తీవ్రవాద దాడులు మరే దేశం ఎదుర్కోలేదు. మన దేశం స్థానంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, చైనా వంటి దేశాలు ఉండి ఉంటే పాకిస్తాన్ అని పిలవబడే దేశం ప్రపంచ పటంలో ఉండేది కాదేమో! వాస్తవానికి భారతదేశాన్ని పరిపాలించిన గత ప్రభుత్వాలు పాకిస్తాన్ విషయంలో, తీవ్రవాదం విషయంలో మెతక వైఖరిని అనుసరించాయని ప్రపంచ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

చైనాను అడ్డుకునేందుకు..

పహల్గాం తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకున్నది. ఖచ్చితత్వంతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీరులోని తీవ్రవాద కేంద్రాలను భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో 9 తీవ్రవాద స్థావరాలపై దాడులు జరిపి, వందకు పైగా తీవ్రవాదులను మట్టుపెట్టి, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను అతలాకుతలం చేయడం ఒకవైపు జరుగుతుండగా, మరొక వైపు బెలూచీ లిబరేషన్ ఆర్మీ 39 ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం పాకిస్తాన్ పాలకులను ఉక్కిరి బిక్కిరిచేసింది. భారత సైన్యం తీవ్రవాద స్థావరాలపై దాడులు జర పడం, బెలూచీ వేర్పాటు వాదులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేయడం యాదృచ్ఛికమేమీ కాదు. ఇది అమెరికాకు కలిసొచ్చే విషయంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. చైనా ఆర్థిక కారిడార్అ డ్డుకునేందుకు బీఎల్ఏను సాధనంగా అమెరికా వాడుకుంటుంది.

ఒంటరిని చేసి..

చివరగా అమెరికా జోక్యంతో భారత్ కాల్పుల విరమణ ఒప్పుకోవడం పాకిస్తాన్ ప్రజలకు, పాలకులకు కొంత ఊరటనిచ్చిందేమో కానీ మన దేశాన్ని ప్రేమించే వారికి ససే మిరా ఇష్టం లేదు. పాకిస్తాన్‌ను సర్వనాశనం చేయడానికి సమయం ఇదేనని, ఈ అవకాశాన్ని సైన్యం సంపూర్ణంగా వినియోగించుకోవాలని తీవ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి సరైన గుణపాఠం నేర్పించే అవకాశం దొరికిందని ఈ దేశ హితాన్ని కోరే వారి నిశ్చితాభిప్రాయం. కానీ మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌లోని తీవ్రవాద స్థావరాలపై విరుచుకు పడి, తీవ్రవాదుల నడ్డి విరిచి, పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలలో ఒంటరిదాన్ని చేసిన తీరు కడు ప్రశంసనీయం.

ఉల్లి బాలరంగయ్య

94417 37877

Next Story