తుపాన్‌గా మారిన బీసీల ఐక్యత..

by Ravi |   (  Updated:2025-10-16 01:01:09  IST  )

గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న బీసీ అలజడి తుపా‌న్‌గా మారింది. ఈ తుపాన్ తెలంగాణ అంతటా ఆవరించి బహుజన కులాలలో చైతన్యానికి దారితీస్తుంది. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలన్ని తమ రాజకీయ

తుపాన్‌గా మారిన బీసీల ఐక్యత..
X

గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న బీసీ అలజడి తుపా‌న్‌గా మారింది. ఈ తుపాన్ తెలంగాణ అంతటా ఆవరించి బహుజన కులాలలో చైతన్యానికి దారితీస్తుంది. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలన్ని తమ రాజకీయ వెనుకబాటుతనం గురించి ఆలోచిస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తమ రాజకీయ వెనుకబాటుతనానికి కారకులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణలోని ప్రతి గ్రామంలో రాజకీయ చైతన్యానికి దారితీస్తుంది. బహుజన కులాలైన సబ్బండ కులాలు ఒక్కటై తమ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు.. ఈ కులాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కుల, మత, ప్రాంత విభేదాలని పక్కనపెట్టి తమ రాజకీయ హక్కులను పొందడం కోసం ఒకటవుతున్నారు.. రాబోయే రోజులలో ఈ ఉద్యమం మహా ప్రళయంగా మారి తెలంగాణ అంతట బహుజన రాజ్యాధికారానికి అడుగులు పడుతూ తమ రాజకీయ వెనుకబాటుతనానికి కారకులైన వారిని మింగేసే ప్రమాదం లేకపోలేదు. ఈ మహా ఉద్యమాన్ని బహు జనులలోని సబ్బండ వర్గాలు స్వాగతిస్తూ తమ అక్కున చేర్చుకుంటూ తమ జాతిని చైతన్యం చేసుకుంటూ తమ బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం పనిచేస్తే తెలం గాణలో బహుజన రాజ్యాధికారం ఎంతో దూరం లేదు.

కొన్ని వర్గాల రాజకీయ కుయుక్తులు..

అందరూ సమానమే అని చెబుతూ.. కొన్ని వర్గాల వారు కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అధికారాన్ని అనుభవిస్తూ.. చట్టసభల్లోకి బహుజన వర్గాలను రాకుండా అడ్డుకుంటూ.. బహుజనుల అధికార వాటాని వారు అనుభవిస్తూ.. రాజకీయ కుయుక్తులతో కింది స్థాయి వర్గాల వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా చేస్తూ.. రాజకీయ అధికారం వారి చెప్పు చేతుల్లో ఉండేలా చేసుకున్నారు. తమ అధికారం కోసం, తమ ఆధిపత్యం కోసం వారు చేసే సామ, దాన, భేద, దండోపాయాలు అన్ని ఇన్ని కావు. గత కొన్ని దశాబ్దాలుగా ఏ ఉద్యమం వచ్చినా ఆ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించడం ఆ ఉద్యమం ద్వారా వచ్చే రాజకీయ ఫలితాలను అనుభవించడం వారికి పరిపాటిగా మారింది. అంతేగాక ఏ ఉద్యమం అయితే తమ రాజకీయ అధికారాన్ని దూరం చేస్తుందో.. ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం రాజకీయ గోకర్ణ గజకర్ణ టక్కుటమార విద్యలు ప్రయోగిస్తూ... అంతిమంగా ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఇలాంటి రాజకీయ కుయుక్తులు వారికి మాత్రమే సొంతం. ఇటువంటి రాజకీయ విచ్ఛిన్న శక్తుల నుండి ఈ ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బహుజనులపై ఎంతైనా ఉంది.

మౌనంలో బహుజన మేధావి వర్గం..

ఏ ఉద్యమం అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా సరైన కార్యాచరణతో ముందుకు నడవాలంటే ఆ ఉద్యమానికి మేధావి వర్గం సలహాలు చాలా కీలకం. బీసీ అలజడి తెలంగాణ అంతట ఆవరించి గ్రామగ్రామాన సబ్బండ వర్గాలు చైతన్య మవుతూ.. రాజకీయ చైతన్యంతో తమకు రాజకీయాలలో భాగస్వామ్యం కావాలని ఉద్యమం వైపు అడుగులు వేస్తూ తరుణంలో బహుజన మేధావి వర్గం మౌనం వహిస్తే.. బహుజన రాజ్యాధికార ఉద్యమం ఆత్మ రక్షణలో పడే ప్రమాదం ఉంది. అందుకే మేధావి వర్గం ఒక అడుగు ముందుకు వేసి ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాక ఉద్యమ కార్యాచరణ ప్రకటిం చాలని ఆ వర్గాలు కోరుకుంటున్నారు.. అలాగే కొన్ని వర్గాల రాజకీయ కుట్రలను పసిగడుతూ ఉద్యమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్త పడుతూ ఉద్యమాన్ని అంతిమ తీరాలకు చేర్చాలని తెలంగాణలోని బహుజన వర్గాలు కోరుకుంటున్నారు..

- నాగుల ప్రణయ్ భాస్కర్

9666286166

Next Story