- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. దేశానికి మార్గదర్శకం!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 విజయవంతమైంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో విడుదలైన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ రాష్ట్రాభివృద్ధికి మాత్రమే కాకుండా దేశ ప్రగతికి కూడా తోడ్పడనుంది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 విజయవంతమైంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో విడుదలైన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ రాష్ట్రాభివృద్ధికి మాత్రమే కాకుండా దేశ ప్రగతికి కూడా తోడ్పడనుంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ ఎదగడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో దూసుకుపోతోంది..
విద్య, యువతకు ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, ఉద్యోగులకు భరోసా ఇలా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర సుస్థిర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌లో ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047తో వందేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. 2047లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలంటే పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగం పట్ల సమగ్రమైన ప్రణాళికలు అవసరం.
తెలంగాణ అభివృద్ధికి గొప్ప అడుగు..
ప్రస్తుత జీఎస్‌డీపీ రూ.16.41 లక్షల కోట్ల నుండి ట్రిలియన్ దిశగా, అక్కడి నుండి 3 ట్రిలియన్ దిశగా చేరు కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగాల వారీగా పెట్టుబడులను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. విజన్ డాక్యుమెంట్‌లో ఈ రంగాలను ప్రభుత్వం సెక్టార్ల వారీగా విభజించింది. ఈ డాక్యుమెంట్‌ను 4 లక్షల మంది ప్రజల సూచనలు, ఐఎస్‌బీ నిపుణులు, నీతి అయోగ్ సహకారంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రణాళిక రూపొందింది. పారి శ్రామికాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మాన్యుఫ్యాక్చర్ హబ్‌లు, ఏరోస్పేస్, సెమికండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్, ల్కెఫ్ సైన్స్, రేడియల్ హైవేలు, విద్యుత్తు వాహనాల తయారీ అంటూ జిల్లాల వారీ సమతుల్య అభి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యువతకు ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం మానవ పెట్టుబడి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ రూపొందించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదరడం తెలంగాణ అభివృద్ధి దిశగా గొప్ప అడుగు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను అందిస్తూ ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ఈ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారింది. ఐటీ రంగంలో ప్రముఖ కంపెనీలతో పాటు విద్యుత్, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఫార్మా, ఆటోమొబైల్, డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టేందుకు భారీగా ముందుకొచ్చాయి.
పర్యావరణానికి ప్రాధాన్యత..
ఈ ఫ్యూచర్ సిటీలో వేల కోట్ల పెట్టుబడులతో పాటు ఎన్నో వేల ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. అలాగే ప్రభుత్వం ఈ సిటీలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ కార్బన్ రహిత ప్రాంతంగా రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక వ్యవసాయంలో అధికోత్పత్తి, ఆహార ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రైతు సంఘాలు, గిడ్డంగులు, మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1 లక్ష కోట్ల రుణాలు, 60 ఏళ్ల వారికి ఆరోగ్యం అందుతుంది. ఇక ప్రజారోగ్యానికి రూ.30,000 కోట్లు కేటాయించనున్నారు. మరోవైపు విద్యా వ్యవస్థలో అప్రెంటిషిప్ విధానం తీసుకొచ్చి తెలంగాణ స్కిల్ మిషన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో యువతకు అవకాశాలు మెరుగుపర్చేందుకు విజన్ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యతిచ్చారు.
తెలంగాణ అన్‌స్టాపబుల్‌గా మారడం ఖాయం!
ఈ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ కేంద్రకంగా జరిగిన ప్పటికీ హైదరాబాద్ సాంకేతిక కేంద్రంగా మారుతూ పరిసర జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. అభివృద్ధిని కేవలం గ్రేటర్‌కు మాత్రమే పరిమితం చేయకుండా జహీరాబాద్, నిజామాబాద్, కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, కొడంగల్ క్లస్టర్‌లతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అధికారుల కృషితో ఈ సమ్మిట్ విజయవంతంగా ముగిసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రాంగణాన్ని సందర్శించడానికి ప్రభుత్వం మూడు రోజుల పాటు అవకాశం కల్పించింది. గ్లోబల్ సమ్మిట్‌కు ఊహించిన దానికంటే భారీ స్పందన రావడంతో తెలంగాణ ‘అన్‌స్టాపబుల్’, ‘అన్‌బీటబుల్’గా మారడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వ సంకల్పం, ప్రజల సహకారంతో వికసిత్ భారత్‌కు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తుంది.
-అమరవాజీ నాగరాజు,
జర్నలిస్టు,
91003 11069






