- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రరాజ్యపు అశాంతిదూత
'నేనింతా కష్టపడి భారత్- పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ చేయిస్తే నాకు మాత్రం నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరేం?

'నేనింతా కష్టపడి భారత్- పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ చేయిస్తే నాకు మాత్రం నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరేం?' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరడం, 'అసలు ట్రంప్ కన్నా ఆ బహుమతికి అర్హులెవరు?' అంటూ పాకిస్తాన్ మిలిటరీ బాస్ భక్తిపూర్వకంగా మాట్లాడడం మూడు రోజుల కింద ప్రపంచం చూసిన కామెడీ షో. ఒకవైపు భారత ప్రధాని, ట్రంప్‌తో నేరుగానే 'తమరి పాత్ర ఏం లేదు బాస్, యుద్ధం ఆపడం మా సొంత నిర్ణయం' అని తెగేసి చెప్పినా ఆయనది అదే పాట. చివరకి ఆ స్టేట్‌మెంట్ వరకూ తగ్గినా, నోబెల్ శాంతి బహుమతి విషయంలో తగ్గేదేలే అంటూనే ఉన్నారు.. ఆయన భూగోళం మీద జరిగిన యుద్ధాలన్నీ ఆపేస్తాను అంటూ పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఘర్షణనీ ఆపలేకపోయాడు. ఆపలేరు కూడా.. కాకపోతే ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి యుద్ధాన్ని ఎగదోయడం తాజా విషయం. గత పది రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా నేరుగా పాల్గొంది. పరోక్షంగా ఇజ్రాయెల్‌కి మద్దతు ఇవ్వడం ఆది నుంచి ఉన్నా, నేరుగా రంగంలోకి దిగడం ఇదే తొలిసారి.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ గానీ, ఏ అధికారిక సీక్రెట్ సర్వీస్ గానీ ఇరాన్‌కు ఇప్పట్లో అణుబాంబు తయారు చెయ్యగల సామర్థ్యం ఉందని చెప్పలేదు. కానీ ఆ వంకతోనే దాడి చేసింది. ఇప్పుడు దెబ్బతిన్న ఇరాన్, హార్ముజ్ జలసంధిని మూసేస్తామని పార్లమెంట్‌లో నిర్ణయించింది. అదే జరిగితే ప్రపంచానికి ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనదేశం అధికభాగం చమురుని ఆ జలసంధి మార్గంలోనే పొందుతుంది. ప్రపంచ ఆర్థికం కుదేలవుతుంది. ఇలా అమెరికా యుద్ధాన్ని వీలైనంత పైకి రాజేసింది. నోబెల్ సంస్థ శాంతికి లాగానే 'అశాంతి దూత' బహుమతి కేటగిరి ప్రవేశపెట్టి అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలి. అదే సమంజసం.
-డా. డి.వి.జి. శంకరరావు
94408 36931






