- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శత ప్రయోగాల షార్
ఇస్రో తన 100వ ప్రయోగంలో భాగంగా నింగిలోకి రాకెట్ పంపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న

ఇస్రో తన 100వ ప్రయోగంలో భాగంగా నింగిలోకి రాకెట్ పంపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ దీనికి వేదిక అయింది. బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 నావిక్–2 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ప్రయోగ వాహకనౌకద్వార విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిది. ఇది ఇస్రోకి వందో ప్రయోగం.
ఇస్రో, పేద దేశానికి అంతరిక్ష ప్రయోగాలా? అని ఎద్దేవా చేసిన దేశాల సరసన నిలిచింది. ఇంతై ఇంతింతై అన్న చందంగా అకుంఠిత దీక్షతో అంకితభావంతో ఖచ్చితత్వంతో అందుబాటులో ఉన్న వనరులను అందిపుచ్చుకుంటూ విజయాలను కరతలామలకం చేసుకుంది ఇస్రో. శ్రీహరికోటకు ఉన్న భౌగోళిక పరిస్థితులు రాకెట్ ప్రయోగాలకు అనుకూలం కాబట్టే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ (శాటిలైట్ డాకింగ్) ను విజయవంతం చేయడం ద్వారా డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.
పరాజయం నుంచి విజయ ప్రస్థానం!
సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1979 ఆగస్టు 10న SLV 3 E -1 రాకెట్ ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. అయితే, ఆ తర్వాత జరిపిన రెండు ప్రయోగాలు విజయవంతమైనాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉప గ్రహా లను, 433 విదేశీ ఉపగ్రహాలను, రెండుప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో, ప్రయోగించింది. సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి మొత్తం జరిగిన ప్రయోగాలు 100 విజయం సాధించినవి 85 విజయశాతం (84.85%) 10 ప్రయోగాలు విఫలమైనాయి. (విఫలం రేటు - 10.10%) 5 ప్రయోగాలు పాక్షిక విజయం సాధించాయి. పాక్షిక విజయాల రేటు(5.05%) అంతరిక్ష రంగంలో ఇంత సక్సెస్ రేటు సాధించడం చాలా క్లిష్టమైన విషయం.
స్థిరమైన భౌగోళిక వేదిక
1969లో శ్రీహరికోటను తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎంపిక చేశారు. అయితే దాదాపు 43,360 ఎకరాల విస్తీర్ణంలో 50 కి.మీ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ ద్వీపం దాని ఎంపికను ప్రభావితం చేసే అనేక అంశాలను కలిగి ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల లాంచ్ సమయంలో ఇంధనం ఆదా అవుతుంది. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. అంతేకాకుండా. స్థిరమైన భౌగోళిక వేదిక కూడా శ్రీహరి కోటకు కలిసి వచ్చింది. ప్రయోగం విజయవంతంగా జరగాలంటే.. ప్రయోగ సమయంలో ఉత్పన్నమయ్యే తీవ్రమైన కంపనాలను తట్టుకునేంత దృఢంగా భూమి ఉండాలి. శ్రీహరికోట ఇందుకు సరైన నేల. ఇప్పటికే ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు అందుబాటులో ఉండగా ఇటీవలే మూడవ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష యాత్రల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. స్వయం కృషితో అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం ఉపగ్రహ వాహకనౌకల తయారీలో స్వయం సమృద్ధి సాధించి మరిన్ని ప్రయోగా లు చేయడానికి శత ప్రయోగాల షార్ విజయోత్సా హంతో హుషారుగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నది.
- వి.సుధాకర్
99898 55445






