- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.. నియంత్రణ ఎక్కడ?
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల పెరుగుదల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అడ్మిషన్ ఫీజులు, వార్షిక చార్జీలు, అదనపు వసూళ్లతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరుగుతోంది.

నేడు రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠ శాలల ఫీజులు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఎల్‌కేజీ ఫీజులే రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారు. 2026–27 విద్యా సంవత్స రానికి అడ్మిషన్ల పేరుతో భారీ ఫీజులు విధిస్తుండగా, కొన్ని పాఠశాలలు ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయని చెబుతున్నాయి. తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలని ఆశిం చే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజుల భారా న్ని చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఫీజు నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొచ్చినా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వాటిని పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవ హరిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు అడ్మిషన్ ఫీజు, వార్షిక ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్నికల ముందు ఫీజుల నియంత్రణపై హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ పాఠశాలలు మండల స్థాయి వరకు విస్తరించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల కష్టార్జిత సంపాద నపై తీవ్ర భారం పడుతోంది. ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు మొత్తం సీట్లలో 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించాలి. అయితే అనేక పాఠశాలలు ఈ నిబంధనను అమలు చేయ కుండా డొనేషన్‌లు, అడ్మిషన్ ఫీజులు, యూని ఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నాయి. వీటిని తమ వద్దనే కొనా లని తల్లిదండ్రులను బలవంతపెడుతున్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజులపై నియం త్రణ తీసుకురావడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
-జూపల్లి దీపికా
ఏబీవీపీ






