- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకల్ ట్రైన్ల సంఖ్యను పెంచాలి!
ముంబై దాని పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలకు సబర్బన్ రైలు వ్యవస్థ మాత్రమే సరసమైన ప్రయాణ మార్గం.

ముంబై దాని పరిసర ప్రాంతాలలో నివ సిస్తున్న మెజారిటీ ప్రజలకు సబర్బన్ రైలు వ్యవస్థ మాత్రమే సరసమైన ప్రయాణ మార్గం. ఇది ప్రతిరోజూ దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. పెద్ద ఎత్తున పౌరులు ప్రయాణిస్తున్న ఈ ట్రైన్‌లలో భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు! కానీ ఇక్కడ అనేక సంవత్సరాలుగా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ, రైళ్ల సంఖ్య తదనుగుణంగా పెరగలేదు. 2025 జూన్ 9 ఉదయం ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదంలో, నలుగురు ప్రయాణికులు రెండు రైళ్ల నుండి పడి మరణించగా, అనేక మంది గాయపడ్డారు. 2024 అధికారిక గణాంకాల ప్రకారం, గత రెండు దశా బ్దాలుగా సబర్బన్ రైలు వ్యవస్థలో 51,802 మంది ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో ఎక్కు వ మంది థానే, వాసాయి, బోరివాలి స్టేషన్లలోనే మరణించారు. 2024 సంవ త్సరంలోనే 2,468 మంది మరణించగా, రైల్ నెట్‌వర్క్‌లో 2,697 మంది గాయపడ్డారు.. ఇది దేశ ఆర్థిక రాజధానిలో సగటున ప్రతి రోజూ ఏడుగురు ప్రయాణికులు మరణిస్తున్నట్లు నివేదిక చూపి స్తుంది. అయితే అధికారికంగా నివేదించబడిన డేటా కంటే వాస్తవ మరణాలు, గాయాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచంలోని మరే నగరంలోనూ నివారించదగిన ప్రమాదాలలో ప్రయాణికులు ఇలా చని పోరు..! జూన్ 9న ప్రయాణికుల దారుణ మరణం తర్వాత ప్రజల ఆగ్రహానికి ప్రతిస్పందనగా, ప్రభుత్వం ఆటోమేటిక్ తలుపులు, పైకప్పుపై అమర్చిన వెంటిలేషన్ కోచ్‌లతో రైళ్ల కోసం కొత్త డిజైన్‌ను ప్రకటించింది. కానీ ప్రయాణీకులు క్షేమంగా ప్రయాణించడానికి రైళ్ల సంఖ్యను, లేదా రైలుకు కోచ్‌ల సంఖ్యను పెంచడమే ఈ సమస్యకు నిజమైన పరిష్కారం.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752






