- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరుగుతున్న నేరాలు అరికట్టాలి!
2023 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంకాల నివేదికను ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ అధికారిక గణాంకాలు

2023 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంకాల నివేదికను ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ అధికారిక గణాంకాలు వివిధ నేరాల పెరుగుదలను సూచిస్తోంది. అందులో ముఖ్యంగా గిరిజనులపై జరిగిన నేరాల్లో, అంతకుముందు ఏడాది కన్నా 28 శాతం పెరుగుదల కనబడడం తీవ్ర ఆందోళనకరం. ఈ నేరాల్లో మణిపూర్ మొదటి స్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్ రెండోస్థానం పొందింది. ఈ తరహా నేరాలు మిగతా రాష్ట్రాల్లో కూడా గణనీయంగానే నమోదైనాయి. పిల్లల పట్ల జరిగిన వాటిలో తొమ్మిది శాతం పెరుగుదల, మహిళల పట్ల కూడా పెరుగుదలనే చూపిస్తున్నాయి. ఇక సైబర్ నేరాలయితే మరింత దూకుడుగా ఉన్నాయి. వాస్తవానికి అధికారిక లెక్కలు పరిస్థితిని పైపైన చూపిస్తాయి. ఈ నివేదికల్లో సాధారణంగా జరిగిన నేరాలన్నీ నమోదు కావు. ఇక పోలీసు స్టేషన్ దృష్టికి రానివి, నమోదు కానివి అధికంగానే ఉంటాయి. ఈ నేరాలు ఇంకా తీవ్రంగానే ఉంటాయి. అసలు నేరాల నమోదు పెరుగుతున్న నివేదికను చూస్తే బాధితుల్లో అవగాహన, కొంత అధికారుల్లో పెరిగిన బాధ్యతను చూపిస్తున్నా, ఇలా గణాంకాలు పెరుగుతూ రావడం అన్నది నేరాలు జరగడానికి, వృద్ధి చెందడానికి ఊతమిస్తున్న వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపిస్తుంది. వ్యవస్థలను గాడిలో పెట్టుకోడానికి ఇలాంటి నివేదికలు ఉపయోగపడాలి. కేవలం కఠిన చట్టాలు మాత్రమే సమస్యకు పరిష్కారం చూపలేవు. అమలు చేసే యంత్రాంగం సమర్థత, చురుకుదనం, జవాబుదారీతనం పెంచేలా పరిస్థితులు కల్పించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. కేసు నమోదు, దర్యాప్తు మొదలుకొని విచారణ, అంతిమ తీర్పులు శీఘ్రంగా జరగాలి. నేర నియంత్రణ, అదుపులకు ఇతర దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల్ని, ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేసి దేశంలో అమలు పరచాలి. నేర రహిత సమాజం దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తే, కనీసం నేరాల పెరుగుదలలో కట్టడి సాధ్యమౌతుంది.
-డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931






