- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్నది.. కృత్రిమ మేధో యుగం
దక్షిణార్ధ గోళంలోని ప్రపంచ దేశాల్లోనే తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఢిల్లీలో జరగడం భారత్‌కి తలమానికం.

దక్షిణార్ధ గోళంలోని ప్రపంచ దేశాల్లోనే తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఢిల్లీలో జరగడం భారత్‌కి తలమానికం. 100 దేశాల ప్రతి నిధులు, వందలాది మంది పారిశ్రామిక దిగ్గజాలు, దేశాధి నేతలు పాల్గొంటున్న ఈ సదస్సు కృత్రిమ మేధపై కూలంకషంగా చర్చలు జరుపుతుంది. ఐదురోజుల చర్చల అనంతరం ముగింపు రోజు వివిధ దేశాల అంగీకారంతో భవిష్యత్ దారుల్ని స్పష్టపరిచే అధికారిక ప్రకటన వెలువరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా, అన్ని రంగాల్ని ప్రభావితం చేసే శక్తి కృత్రిమ మేధకు ఉంది. అదీ జెట్ స్పీడ్‌లో.. ఆ ప్రభావానికి తగినట్టు వ్యక్తులూ, సమాజమూ తయారు కావాలి. రానున్న మార్పుల్ని పసిగట్టి అవకాశాల్ని ఒడిసిపట్టాలి.. లేదంటే ఇంతవరకూ బలమైనవిగా భావించబడుతున్న దేశాలు బలహీనమౌతాయి. సరిగ్గా వినియోగించుకోగలవి బలం పుంజుకుంటాయి. ఈ మార్పుల్ని ముందే ఊహిస్తూ అమెరికా, చైనా దేశాలు కృత్రిమ మేధ పరిశోధనలపై అధికంగా ఖర్చు పెడుతున్నాయి.. ఫలితంగా చాట్ జీపీటీ, డీప్ సీక్ లాం టివి జనంలోకి వచ్చాయి.. మన దేశం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినా, బలోపేతం కావడానికి సమయం పడుతుంది. కారణం సంస్థాగత లోపాలు.. ముఖ్యంగా నిధులు, నాణ్యమైన, చవకైన ఉన్నత విద్య అందుబాటులో వెనకంజ. మౌలికంగా అవసరమయ్యే డేటా సెంటర్‌లు, బహుళజాతి పెద్ద సంస్థలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినా.. దేశ ఖజానా నింపే పరిస్థితి, ప్రజల సౌకర్యాలు, ఉపాధి పెరిగే పరిస్థితి వస్తేనే ఫలితం. అందుకు విధానాలు ఏర్పరుచుకోవాలి. దేశం కేవలం ఏఐ వినియోగ మార్కెట్‌గా మిగిలిపోకుండా సేవలందించే, ప్రయోజనం పొందే శక్తిగా మారాలి.. వ్యవసాయ, వైద్య, రక్షణ, పాలన తదితర రంగాల్లో ముద్ర వేయగల ఈ సాంకేతికత ప్రజా బాహుళ్యానికి, ప్రగతికి అవసరమైన రీతిలో తయారు కావాలి.. శాస్త్ర సాంకేతిక పరిశోధలకు పెద్దపీట వెయ్యడంతో బాటు ఫలాలను ప్రజల వరకూ తీసుకురావడం ప్రభుత్వ ప్రాధా న్యం కావాలి.. ఆ దిశగా అడుగులు వెయ్యగల శక్తి నవ భారతానికి ఉంది. చిత్తశుద్ధి అందుకు తోడ్పడాలి.
-డా. డి.వి.జి శంకరరావు,
94408 36931






