- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్ స్క్రిప్ట్ బాగుంది కానీ..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం గురించి గురజాడ వారి మాటలతో "దేశమంటే మట్టి కాదోయ్/దేశమంటే

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం గురించి గురజాడ వారి మాటలతో "దేశమంటే మట్టి కాదోయ్/దేశమంటే మనుషులోయ్ అంటూ 2047 నాటికి వంద ఏళ్ల స్వాతంత్ర్య భారత్ ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ సాక్షిగా..! కృత్రిమ మేధ విస్తరణతో చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయి. దానికనుగుణంగా మన విద్యా విధానంలో, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో మనం ముందుండాలి. అందుకే అందరికీ క్వాలిటీ విద్యలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు, డిజిటల్ శిక్షణ, ఈ - బుక్స్, విద్యా రంగంలో ఏఐ వినియోగం వంటివి కేంద్ర బడ్జెట్‌లో స్వాగతించాల్సిన అంశాలుగా చెప్పు కోవచ్చు. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, ఐదేళ్లలో అదనంగా 75వేల మెడికల్ సీట్లు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు, ఐఐటీ, ఐఐఎస్‌ఈల్లో పరిశోధకులకు ఫెలోషిప్‌లు, 5 ఐఐటీల ఏర్పాటు, 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తదితర కార్యక్రమాల ప్రతిపాదనలు ఆశావాదపు అవకాశాలుగానే కనిపిస్తున్నాయి. భారీ పెట్టుబడుల లక్ష్యంతో మూడో ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా వుంటూ వికసిత భారత్‌గా మన సుదీర్ఘ ప్రయాణం ఎందాక వెళ్తుందో కాలమే నిర్ణయించాలి. బడ్జెట్ స్క్రిఫ్ట్ బాగానే వుంది. మరి సినిమా ఎలా వుంటుందో మన భవిష్యత్తు చెప్పాలి.
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536
93947 49536






