- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికుల జీవితాల్లో కూటమి వెలుగులు..
కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని నమ్మే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్మిక వర్గం జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు..

కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని నమ్మే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్మిక వర్గం జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కార్మికుల సంక్షేమంపై చంద్రబాబు ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.
రాష్ట్రంలోని భవన నిర్మాణరంగ కార్మికులకు కూటమి ప్రభుత్వ పాలనలో మంచిరోజులు రాబోతున్నాయి.. నిర్మాణ రంగకార్మికుల ఆదాయం, జీవన ప్రమాణం పెరిగే దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తున్నది. తరతమ భేదం లేకుండా మన కార్మికులకే కాదు.. ఇతర రాష్ట్రాల కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారిని అక్కున చేర్చుకొని కార్మిక పక్షపాతి అయ్యారు చంద్రబాబు నాయుడు..
అపార అనుభవంతో..
చంద్రబాబులాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఉండటం వల్లకార్మికవర్గానికి న్యాయం జరుగుతోందనే ధీమా కార్మిక వర్గంలో స్పష్టంగా కనిపిస్తున్నది.. కనీస వేతనాలు రావాలన్నా.. హక్కులు అమలు కావాలన్నా అది ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో దేశంలోని అన్ని రంగాల్లోని కార్మికులకు కొండంత ధీమా వస్తుందని చెబుతున్నారు. చంద్రబాబుకు అపార అనుభవం, ఆలోచనతో నిర్మాణ రంగ కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూర్చి.. మంచిరోజులు తీసుకువస్తున్నారని కార్మికులు సంబర పడుతున్నారు..
కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక ఫోకస్
భవన,ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సైతం వారి సంక్షేమానికి ఖర్చు చేయలేదు. 2014 -19లో తెలుగుదేశం పాలనలో ఎన్ని పథకాలను అమలు చేసినా నిర్మాణ కార్మికులకు బోర్డు ఇచ్చే ప్రయోజనాలు కొనసాగేవి. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరు చెప్పి ప్రత్యేక పథకాలను నిలిపివేసి కార్మికుల పొట్ట కొట్టింది. అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టింది. కార్మికుల జీవితాల్లొ వెలుగులు నింపి పూర్వ వైభవం తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నది. అందులోభాగంగా భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది.
గతంలో 11 పథకాలు ..
నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం 11 పథకాలను అమలు చేశారు.. అయితే గత ప్రభుత్వం కార్మికుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహ రించి ఆ పథకాల అమలును నిలుపుదల చేసింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు.. అంతేకాదు కార్మికుల దర ఖాస్తులు కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉండడం వల్ల సంక్షేమ పథకాలకు నోచుకోలేక అనేక అవస్ధలు పడ్డారు.. అయితే భవన నిర్మాణ రంగ కార్మికుల అవస్ధలను కళ్లారా చూసి చంద్రబాబు చలించి పోయారు.. ఎలాగైనా వీరి జీవితాలు చంద్రోదయం కావాలన్న ఆలోచనతో సంక్షేమ పథకాల అమలుకు మళ్లీ శ్రీకారం చుట్టారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భవన నిర్మాణ రంగ కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి.
చారిత్రాత్మక నిర్ణయం
శ్రామికుల సంక్షేమానికి భవన, ఇతర నిర్మాణ దారుల నుంచి ప్రత్యేకంగా వసూలు చేసే ఒక శాతం పన్నును సంక్షేమ బోర్డులో జమచేసి సంక్షేమ పథకాలకు వినియోగించాలనే నిర్ణయం చారిత్మాత్మకమైనదనే చెప్పాలి. అంతేకాకుండా మహిళా కార్మి కుల, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఇద్దరు ఆడపిల్లలకు ఆర్ధిక సాయం అందించడంతో బాటు వివాహానికి రూ. 40 వేలు ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచన కార్యరూ పం దాల్చబోతోంది. అలాగే కార్మికుడితో పాటు కార్మికుడి భార్య, ఇద్దరు పిల్లలకు ఆర్ధిక సాయం అందించడమే కాక ప్రసూతి కోసం రూ. 20 వేలు ఇవ్వాలన్న నిర్ణయంతో చంద్రబాబు కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైంది. కార్మికుల సహజ మరణానికి రూ.60 వేలు అందించడం, అంత్యక్రియలకు మరో రూ.20 వేలు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయంతో కార్మికులకు మరింత భరోసా లభించనుంది.
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత!
రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్‌లో కార్మిక శాఖకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్‌లో రూ. 735 కోట్లను కేటాయించి శ్రామికుల సంక్షేమ బడ్జెట్ అని నిరూపించారు. నూతన కార్మిక కోడ్స్ అమలు, ఈఎస్ఐ ఆరోగ్య సేవల విస్తరణ, అసంఘటిత రంగ కార్మికుల భద్రత బలోపేతం, వంటి అంశాలకు ఈ నిధులు వినియోగించడం ద్వారా సంక్షేమం నుంచి సాధికారత దిశగా కార్మిక రంగాన్ని మలచాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గతంతో పోలిస్తే సామాజిక భద్రత వ్యయం, నైపుణ్యాభివృద్ధికి,ఆరోగ్య మౌలిక వసతులు, డిజిటల్ పర్యవేక్షణకు బడ్జెట్‌లో కేటాయింపులు గణ నీయంగా పెరిగాయి.. కార్మికుల పక్షపాతి చంద్రబాబు పాలనలో కార్మికుల జీవితాల్లో చంద్రోదయ వెలుగులు ప్రకాశించాలని ఆశిద్దాం.
-వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం






