- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యంపై పల్లెల పోరాటం..
తెలంగాణలో గ్రామ పంచాయతీలు మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది?

రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు తమ గ్రామాల్లో మద్యం విక్రయాలను నిరోధించేందుకు తీర్మానాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రోజువారీ కూలీలు సహా అనేక మంది తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని మద్యానికి వెచ్చించడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ సభల్లో మద్యం వ్యతిరేక తీర్మానాలు చేయడం స్వాగతించదగిన పరిణామం. మద్యం ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, సామాజిక శాంతిని దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాలు పూర్తి లేదా పాక్షిక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం కారణంగా కుటుంబాల ఆర్థిక నష్టం, గృహహింస, ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో "తెలంగాణలో కూడా దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేయాలా? లేక అవగాహన, కట్టుదిట్టమైన నియంత్రణతోనే సమస్యను అధిగమించాలా?" అనే చర్చ మరోసారి ఊపందుకుంది. మద్యపాన వ్యసనాన్ని తగ్గించడంలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకం. గ్రామ సభల్లో విస్తృత చర్చలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, అక్రమ మద్యం విక్రయాలను అరిక ట్టేందుకు అధికారులతో సమన్వయం చేయడం, యువతను మద్యానికి దూరంగా ఉంచే కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు తీసుకుంటే మరిన్ని గ్రామాల్లోనూ సానుకూల మార్పు సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు, "పల్లెలు అభి వృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది." ఆ లక్ష్యాన్ని సాకారం చేయాలంటే గ్రామీణ సమాజాన్ని మద్యం వంటి సామాజిక సమస్యల నుంచి క్రమంగా బయటపడేలా చేయడం అవసరం.
- ఎన్నబోయిన సురేందర్
97006 49123






