ఈ పంటలే వేయండి... రైతులకు వ్యవసాయశాఖ ఆదేశాలు

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది.

ఈ పంటలే వేయండి... రైతులకు వ్యవసాయశాఖ ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు లేక జనాలు ఇటు రైతులు అల్లాడిపోతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అస్సలు పడడం లేదు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. వానాకాలం అత్యవసర ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. వరి సాగును తగ్గించి... తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేయాలని పేర్కొంది. జులై 16వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య వర్షాలు పడితే... జొన్న, పల్లి, పొద్దు తిరుగుడు, పత్తి లాంటి పంటలు వేసుకోవాలని పేర్కొంది. ఇక ఆగస్టు ఒకటో తేదీ నుంచి 15 వ తేదీ మధ్య వర్షాలు పడితే కంది, కొర్రలు, ఇతర చిరు ధాన్యాలు, కూరగాయలు సాగు చేయాలని దిశా నిర్దేశం చేసింది.

Next Story