- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనపై బ్యాటింగ్ కోచ్ కీలక ప్రకటన
ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మపై బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రోహిత్ శర్మపై బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై ఇలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అతడు పెద్ద ప్లేయర్ అని... అలాంటోడు భారత జట్టుకు అవసరమంటూ పేర్కొన్నారు. రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్, యశస్వి జైష్వాల్ లకు ఓపెనర్ గా అవకాశాలు ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నలకు బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సమాధానం ఇచ్చారు.
రెండు బ్యాడ్ ఇన్నింగ్స్ లు రోహిత్ శర్మ ఆటను జడ్జ్ చేయలేవని కుండబద్దలు కొట్టి చెప్పారు. అతడు వరల్డ్ క్లాసు ప్లేయర్ అని కితాబ్ ఇచ్చారు. ఒకసారి టచ్ లోకి రోహిత్ శర్మ వస్తే... ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఇది ఇలా ఉండగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో కూడా రోహిత్ శర్మ లేడని అంటున్నారు. దీనిపై మాత్రం బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ రియాక్ట్ కాలేదు.






