విదేశాలకు వెళ్లే విద్యార్థులూ జాగ్రత్త!

by Ravi |   (  Updated:2025-08-05 00:30:26  IST  )

ఉన్నతమైన చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు.. మీరు మంచి లక్ష్యంతో ఉన్నత చదువుల కోసం అందరినీ వదిలేసి దూరంగా

విదేశాలకు వెళ్లే విద్యార్థులూ జాగ్రత్త!
X

ఉన్నతమైన చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు.. మీరు మంచి లక్ష్యంతో ఉన్నత చదువుల కోసం అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నారు. మీ ఈ ప్రయాణం కొనసాగిస్తున్నది చదువు కోసమే అనే విషయాన్నీ అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోండి. మీ ఈ ప్రయాణంలో చదువుకు విలువ ఇవ్వండి. అంతేకానీ చెడువైపు ఆకర్షితులు అవ్వకండి. మీ లోకం నుంచి బయట ప్రపంచానికి వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఆకర్షణ మీ ఆధీనంలో ఉండాలి. చెడు వైపు ఒక్క అడుగు వేసినా మీ జీవితాన్ని కబళించేస్తుంది. మీ కుటుంబ పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఆకర్షణలో మునిగిపోతే అంతం అయ్యేది మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారనే విషయాన్ని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చేసే ఏ పనినైనా ఒకటికి రెండుసార్లు మీ కుటుంబ సభ్యులను, సమాజంలో వాళ్లకు ఉండే గౌరవ మర్యాదలను ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. మమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు తప్పు అనిపిస్తే ఆగిపోండి. మద్యం, డ్రగ్స్, స్మోకింగ్, ర్యాగింగ్ లాంటి దురలవాట్లకు దూరంగా ఉండండి. ఆకర్షణలను దరి చేరనీయకండి. ఏ పొరపాట్లు చేయకుండా ఎప్పటి కప్పుడు మిమ్మల్ని మీరు నియత్రించుకోవాలి. మీరు జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో, తలకుమించిన ఆర్థికభారం మోస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, అహర్నిశలు కష్టపడుతున్నారు. మీ ప్రాణాలే వాళ్ల ప్రాణాలుగా కష్టాలను కడుపులో దాచుకొని మీ చిరునవ్వు కోసం తాపత్రయ పడుతున్నారు. ఎలాంటి స్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. చిన్న తప్పటడుగు వేసినా మీ పరిస్థితులు మారిపోతాయి. మంచి ఆలోచనలతో ఆత్మస్థయిర్యంతో ధైర్యంగా అడుగు వేయండి, మీ చదువు ప్రయాణం సాఫీగా సాగనీయండి. మీ తల్లిదండ్రుల ఆశలకు మీరు ఇచ్చే రూపమే మీ ఉన్నతమైన చదువు సాధించడం. మీ చదువు మీకే కాదు, రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. మీలో ఉండే ప్రతిభ మరెం దరికో ఆదర్శం అవ్వాలి.

-వై. సంజీవ కుమార్,

94936 13555

Next Story