- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థి సంఘాలు.. విద్యార్థుల శ్రేయస్సుకేనా!!
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలకు గొప్ప చరిత్ర ఉంది. సమాజ సమస్యలపై విద్యార్థుల స్వరం వినిపించడం ప్రజాస్వామ్యానికి బలం. కానీ ఇటీవలి సంవత్సరాలలో, అసలు విద్యార్థి ప్రయోజనాలతో

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలకు గొప్ప చరిత్ర ఉంది. సమాజ సమస్యలపై విద్యార్థుల స్వరం వినిపించడం ప్రజాస్వామ్యానికి బలం. కానీ ఇటీవలి సంవత్సరాలలో, అసలు విద్యార్థి ప్రయోజనాలతో సంబంధం లేని ఎన్నో కొత్త విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు తెరపైకి వచ్చి, వసూళ్ల పేరుతో విద్యాసంస్థలను వేధించే పరిస్థితి పెరిగిపోతోంది. చందాల పేరుతో విద్యాసంస్థల నిర్వహకులను, ఉపాధ్యాయులను వేధించి అడిగినంత ఇవ్వకపోతే వారిని బెదిరిస్తూ విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.
రోజురోజుకూ కొత్త కొత్త పేర్లతో పుట్టుకొస్తున్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల కారణంగా బడ్జెట్ విద్యాసంస్థలు ఉనికిలో కుదేలవుతున్నాయి. అసలు విద్యార్థి సంఘాలు, సంఘాల సభ్యులు ఆఫీసులోకి వచ్చారంటే విద్యాసంస్థ యజమానులకు జ్వరం వచ్చినట్లుగా వణికిపోయే పరిస్థితి తయారైంది. పలు సందర్భాల్లో ఉపాధ్యాయులు, నిర్వహకులు తమ పనిపై సంపూర్ణంగా దృష్టి పెట్టడానికి ఈ పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
చందాల పేరుతో బెదిరిస్తూ..
ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులంటే వారేం ఆకాశం నుంచి దిగిపడ్డ వాళ్లు కాదు.. మనలాగే చదువుకొని ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంత వ్యవస్థ ద్వారా మరింత మార్పునకు అవకాశం ఉంటుందని నమ్మే వారు. ఎంతోమంది గ్రాడ్యుయేట్లు అందులో ట్యూషన్లు, క్లాసులు చెప్పుకుంటూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. అలాంటి వారిని తప్పేం లేకున్నా ఈ సంఘాల వారు వచ్చి చందాల పేరుతో నిలదీయడం, ఇవ్వకపోతే తెల్లారి బందుకు పిలుపునియ్యడం చేస్తుంటారు. ఇలాం టి సమస్యల మధ్య అసలు చదువు చెప్పాలా? ఈ సమ స్యతో కొట్టుమిట్టాడాలా? అనే సంశయంతో ఆ యజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఇక విద్యాసంస్థల్లో జరిగే వ్యక్తిగత సంఘటనల్లోకి, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలపై బయట ఉన్న ఈ సంఘాలు జోక్యం చేసుకోవడం వల్ల సమస్యల పరిష్కారం క్లిష్టమవుతుంది. కొన్నిసార్లు మధ్యవర్తిత్వం పేరుతో ఆర్థిక ఒ ప్పందాల గురించి చర్చలు జరిగే పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్చలు జరిపి యాజమాన్యాల నుండి ఎంతో కొంత డబ్బు వసూలు చేసుకొని అందులో కొంత పర్సంటేజ్ నొక్కేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
కుల సంఘాలది మరోతీరు..
ఇక కుల సంఘాలు తీరు మరోరకం. ఈ సంఘాలు వార్షిక కార్యక్రమాలు లేదా సంస్థాగత అవసరాల పేరుతో సహకారం కోరుతున్నాయి. కొంతమంది భోజనాల ఖర్చుకు, రవాణా ఖర్చుల కోసం కొంచెం చందా ఇవ్వడంటూ స్కూల్ యజమాన్యాలను వేధిస్తున్నారు. అయితే ఇది సహజమే అయినా, ఏదైనా సహకారం కోరే విధానం పారదర్శకంగా ఉండాలి. అంతేకానీ అధికారిక రసీదులు, సంస్థ వివరాలు ఇవ్వకపోతే ఎలా యాజమాన్యం ఆ డబ్బులు ఇస్తుంది? ఇచ్చిన డబ్బుకు రసీదు ఇవ్వకపోతే ఇన్‌కమ్ టాక్స్‌లో ఎలా చూపెట్టాలి? ఈ పరిస్థితితో గందరగోళం ఏర్పడుతోంది. పై రెండు సందర్భంలో సాధారణ వ్యక్తికి అర్థమయిపోయే ఉంటది. వారిని బెదిరించి వసూల్ చేసిన మొత్తం వారి జల్సాలకు ఖర్చు పెట్టుకుంటూ సొసైటీలో గుర్తింపు ఉన్న వ్యక్తులకు తలనొప్పిగా తయారవుతున్నారని.
రాజకీయ అండ చూసుకొని..
ఈ విద్యార్థి సంఘాల, కుల సంఘాల బెదిరింపుల కారణంగా రోజురోజుకీ ఛిన్నాభిన్నమవుతున్న విద్యా సంస్థలు కోకొల్లలు. వీరి కారణంగా విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గత కమిషనర్ల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తీసుకెళ్లాయి. దీంతో కొంతకాలం ఈ వసూళ్లు సద్దుమణిగాయి. కానీ తరువాత మళ్లీ ఇలాంటి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మమ్మల్ని ఎవరేం చేస్తారు? మాకు రాజకీయ పార్టీల అండ ఉందని మొండి ధైర్యంతో చిన్న ప్రాథమిక పాఠశాలల నుంచి పెద్ద కళాశాలలు, ప్లే స్కూల్స్, కోచింగ్ సెంటర్లుకు ఈ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. క్రమంగా ఏర్పడుతున్న ఈ వాతావరణం కొన్నిసార్లు వారిలో ఆందోళనకు దారితీస్తోంది.
ఎన్నో ప్రశ్నలు..
విద్యా వ్యవస్థలో విద్యార్థి సంఘాలు విద్యార్థుల శ్రేయస్సుకేనా? అసలు విద్యార్థి సంఘాలు చందాలు అడుగుతాయా? అడిగితే చదువు సంస్కారం ప్రదర్శించి అడగరా? విద్యా విద్యార్థి సంఘాల ముసుగులో పోకిరీల బలవంతపు వసూళ్లు ఇతరత్రా అక్రమాలకు పాల్పడుతున్న వైనం లేదా? అసలు చందాలు ఎందుకివ్వాలి? చదువులో మార్పు కావాలనుకుంటే అభివృద్ధి కరమైన సూచనలతో సూచించవచ్చు కదా, లేకుంటే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవచ్చు కదా? విద్యార్థి సంఘాల సమ్మెలు బందుల కారణంగా విద్యా వ్యవస్థ నాశనం అవుతోంది. నానాటికీ విద్యార్థి సంఘాల పేరుతో విద్యాసంస్థలకు అవస్థలు పెరిగిపోతున్నాయి. అడిగిన చందాలు ఇవ్వలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తెస్తు న్నారు అని విద్యాసంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి. విద్యా వ్యవస్థపై సంఘాల జోక్యం నియంత్రించలేరా అనేది వీరి ప్రశ్న. అందుకే ప్రభుత్వం ఈ అక్రమ వసూళ్ల పరంపరకు చెక్ పెట్టాలి.ఇలాంటి అనుమతి లేని విద్యార్థి, కుల సంఘాలపై చర్యలు తీసుకుని మంచి విద్యా వాతావరణం సృష్టించాలి. విద్యార్థి సమస్యలు, సంస్థల సమస్యలు ఇవి రెండూ చట్టబద్ధంగా, పారదర్శకంగా, పరస్పర గౌరవంతో పరిష్కరించబడితేనే విద్యా వ్యవస్థ దీర్ఘకాలికంగా మెరుగుపడుతుంది.
- సంధ్య
సామాజిక కార్యకర్త






