- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలివైన ఓటరే.. గ్రామానికి భవిష్యత్తు!
తెలంగాణలోని పల్లెల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. పాత రిజర్వేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నదత తెలపడంతో ఈ ఎన్నికలపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. దీంతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు

తెలంగాణలోని పల్లెల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. పాత రిజర్వేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నదత తెలపడంతో ఈ ఎన్నికలపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. దీంతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఆశావహుల నామినేషన్ల పర్వం, ప్రచార పర్వం కూడా మొదలైంది. ఇక ఇప్పుడు అసలు తంతు షురూ కానుంది. ప్రచారాలు, ప్రలోభాలు, వాగ్దానాలు, దావతులు, మద్యం ఏరులై పారే కార్యక్రమాలు అతి త్వరలో అందరూ నోరెళ్లబెట్టి చూసే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో సుమారుగా 23 నెలలుగా గ్రామాలను పట్టించుకునే నాథుడే లేక పరిస్థితి అతి దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో 24/7 అందుబాటులో ఉండే నేతకే ప్రజలు పట్టం కట్టాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అభ్యర్థి గుణగణాలే గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకోవడంలో కీలకమని గుర్తెరగాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మాదిరిగా పైసలకు ప్రాధాన్యతనిచ్చే విషయం మరిచిపోవాలి. ఓటుకు ఇచ్చే రూ.500 లేదా రూ.1,000 కోసం చూసుకుంటే .. ఆ డబ్బులకు ఆశపడితే ఇక ప్రశ్నకు అసలు చోటు ఉండదని పౌరులు గుర్తించాలి. ప్రశ్నకు స్థానంఉండేలా జనం వ్యూహముండాలె. ఓటుకు నోటు అనేది అసలు ఇక్కడ ప్రాధాన్యత అంశం కాదని భావించాలి. ఇక ఈ సారి నోటా కూడా బ్యాలెట్ పేపర్‌లో ఉంటుండటంతో ప్రజలు అభ్యర్థి నచ్చకపోతే దానికైనా ఓటు వేయాలి. డబ్బులు మనం తీసుకోకుండా ఉంటేనే.. మనం ఏదైనా సమస్య గురించి అడిగితే సర్పంచ్ మన సమస్యపై పరిష్కారానికి ప్రయత్నిస్తాడని తెలుసుకుని.. ఈ ప్రాథమిక నియమాన్ని తప్పని సరిగా ముందుకు తీసుకెళ్లి.. జనం అంతా ఏకతాటిపైకి వచ్చి.. ఆలోచించి.. అభివృద్ధి చేసే నాయకుడికి మాత్రమే తమ ఓటును వేసి పట్టం కడితే బాగుంటుంది.
-కె.బాపురావు,
95533 07006






