సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్.. సోనియమ్మను ప్రత్యక్షంగా కలిసిన నా జ్ఞాపకం

by Ravi |   (  Updated:2025-12-09 01:00:53  IST  )

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి సోనియా గాంధీ పేరు ఒక రాజకీయ నాయకురాలిగానే కనిపించి ఉండవచ్చు. కానీ ఉద్యమం మధ్యలో తల్లిలా బాధను గ్రహించి, మాట నిలబెట్టి, అసాధ్యాన్ని సాధ్యం చేసిన వ్యక్తిగా ఆమెను చూసిన మనందరికీ, ఆమె కేవలం ఒక నేత కాదు.. ఒక భావం, ఒక చరిత్ర..

సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్.. సోనియమ్మను ప్రత్యక్షంగా కలిసిన నా జ్ఞాపకం
X

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి సోనియా గాంధీ పేరు ఒక రాజకీయ నాయకురాలిగానే కనిపించి ఉండవచ్చు. కానీ ఉద్యమం మధ్యలో తల్లిలా బాధను గ్రహించి, మాట నిలబెట్టి, అసాధ్యాన్ని సాధ్యం చేసిన వ్యక్తిగా ఆమెను చూసిన మనందరికీ, ఆమె కేవలం ఒక నేత కాదు.. ఒక భావం, ఒక చరిత్ర..

2015 సెప్టెంబర్ 24, నా జీవితంలో చెరగని ముద్ర వేసుకున్న రోజు.. తెలంగాణ కోసం రాజకీయం లెక్కలు పక్కన పెట్టి చేసిన ఆమె నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆతృత నన్ను నాటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి జనపథ్‌ గడప చేరవేసింది.

కళ్ల ముందు తెలంగాణ తల్లి..

నా చేతిలో ఒక చిన్న సంచి.. అందులో శాలువా, ఒక పోర్ట్రెయిట్‌, నా చేతిరాత ఉన్న 20 రూపాయల డీవీడీ.. ఆ డీవీడీపై నా దస్తూరితో రాసిన రాతలు.. అవన్ని పట్టుకుని లోపలికి వెళుతున్నాం. అంతలో, ఒకాయన వచ్చి మా ఇద్దరిని ఒక ఫ్రంట్ గెస్ట్ రూమ్‌లో కూర్చో పెట్టాడు. ఒకాయన లోపలి నుంచి వచ్చినెమ్మదిగా ‘సయ్యద్ రఫీ’ అని పిలిచాడు. నేనే అంటూ సైగ చేస్తే, మమ్మలిద్దరినీ రూమ్‌లోకి ఆహ్వా నించాడు. లోపలికి వెళ్లగానే మా ముందుంది స్వచ్ఛమైన ఆత్మ గల ‘తెలంగాణ తల్లి’ సోనియా గాంధీ!! ఆమె కళ్లల్లో జీవితంలో ఎదుర్కొన్న లెక్కలేనన్ని అనుభవాలు, చిరున‌వ్వులో ఎనలేని ఆప్యాయత, పల క రింపులో పరిపక్వత, సదా సీదా వేషధారణ లోంచి ఉలికిపడే గాంభీర్యం అన్నీ నా కళ్ల ముందే ప్రత్యక్షమై కూర్చున్నట్లు అని పించింది ఆమెను చూస్తుంటే.

నా పరిచయం అవసరం లేదని...

మాటలు మొదలుపెట్టే క్రమంలో, పొన్నాల లక్ష్మయ్య నన్ను తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ రఫీ అని పరిచయం చేయబోతుంటే, ‘ఐ నో’ అంటూ చేయి చూపినారు సోనియా గాంధీ. పొన్నాల తెచ్చిన పూల బొకే ఆమెకు అందచేసారు. నేను శాలువాతో సన్మానించి, డీవీడీ చేతికిచ్చి, సయ్యద్ అనే ఆర్టిస్ట్‌తో గీయించిన ఆమె ముఖ చిత్రపటంపై నా దస్తూరితో ఆమెకు నేను ఉర్దూలో తీసిన ‘జమీన్ హమారీ ఫిర్భీ పరాయే’ సినిమాను అంకితం చేస్తూ ‘సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్’ అనే బిరుదు రాసిన ఫోటో ఫ్రేమ్ అందచేశాను. సానియమ్మ పొన్నాల దిక్కు చూస్తు, ముందస్తుగా ఫోటోగ్రాఫర్‌కి ఇన్ఫార్మ్ చేయనుండే కదా! అని చెపుతూ తన సిబ్బందికి వాళ్ల ఆస్థాన ఫోటోగ్రాఫర్‌ని పిలిపించమని చెప్పారామె. ఫోటోగ్రాఫర్ వచ్చాక మళ్లీ శాలువా కప్పడం, డీవీడీని అంకితం చేయడం, పోటోఫ్రేమ్ సమర్పించడం రీటేక్‌లా జరిగిపోయింది. చకచకా ఫోటో‌ఫ్లాష్‌లు మెరిసాయి.

మీ వల్లే తెలంగాణ సాధ్యపడింది!

కుర్చీలో కూర్చున్న తరువాత.. ‘లెట్ మీ నో, వాట్ మైసెల్ఫ్ అండ్ అవర్ పార్టీ కెన్‌ డూ ఫర్ యు?’ అని అడిగారు. ‘యు హేవ్ ఆల్రెడీ డన్ ఏ లాట్, డెలివర్డ్ తెలంగాణ, విచ్ వాజ్ ఇంపాజిబుల్ వితౌట్ యు! నౌ ఇట్ ఇస్ అవర్ టర్న్ టు గివ్ యు ఏ రిటర్న్ గిఫ్ట్, మేడమ్!’ అనగానే ఆప్యా యతతో చూశారామె. ‘మేడమ్! తెలంగాణ ఇస్తే రాజకీయంగా మీరు ఎంత నష్ట పోతారో తెలిసి కూడా, ఇచ్చిన మాటకు కట్టుబడి, విద్యార్థుల ఆత్మ బలిదానాలకు చలించి మీరు తెలంగాణ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సుష్మ స్వరాజ్‌తో సమన్వయం జరిపి, పార్లమెంట్‌లో ఏ విధంగా తెలంగాణ బిల్లు పాస్ చేపించారో టీవీలో చూసాం. మీరు లేకుంటే, ఇంకెంతమంది బలిదానాలు చేసుకున్నా తెలంగాణ వేరుపడకపోయేది. తాత్కాలికంగా మీరు నష్టపోయి ఉండవచ్చు కానీ, మీరు మీ జీవితంలో చేసిన అతి గొప్ప పని ఇదే! ఈ కారణంగా ఎల్లప్పుడు మీరు తెలంగాణ తల్లిగా కీర్తి గాంచుతారు! నేను యావత్తూ తెలంగాణ ఉద్యమకారుల తరఫున, సామాన్య ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలపడానికి మాత్రమే వచ్చాను’ అని చెప్పాను.

తలుపు వద్దకు వచ్చి మరీ వీడ్కోలు..

నా మనసులోంచి వచ్చిన మాటలు విని, చాలా ఆప్యాయత నిండిన కళ్లతో చూస్తూ శ్రద్ధగా వినే తీరును గమనిస్తే, తెలంగాణ ఇచ్చిన సంతృప్తి ఆమెలో కూడా కన పడింది. మా సమావేశం పూర్తి అయ్యాక ఆ విశాలమైన గది తలుపు వరకు వచ్చి వీడ్కోలు పలికిన తీరు ఇప్పటికీ ఎప్పటికీ నా కళ్లలో తిరుగుతూనే ఉంటుంది. ఆమె అసొంటిది కాబట్టే తెలంగాణ ఇచ్చిందని పిస్తది! ఆమె తెలంగాణ ఇవ్వకుంటే ఇంకెంతమంది ఆత్మబలిదానాలు చేసుకునే వారో? కాబట్టే ఆమెకు కృతజ్ఞత భావనగా ‘సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్ అనే బిరుదు ప్రదానం చేయగలిగిన. నా లాంటి సామాన్యుడు, అంతటి మహోన్నత వ్యక్తికి ఇంకేం చేయగలడు!!

- సయ్యద్ రఫీ

తెలంగాణ ఉద్యమకారుడు

[email protected]

Next Story