తిరుగుబాటు బతుకమ్మ

by Ravi |   (  Updated:2023-10-18 00:30:41  IST  )

satirical batukamma song on government

తిరుగుబాటు బతుకమ్మ
X

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకులన్ని ఆగమాయే ఉయ్యాలో

అమరవీరుల కుటుంబాలు ఉయ్యాలో

ఆగమై పాయే ఉయ్యాలో

దొరగారి కుటుంబం ఉయ్యాలో

బంగారు కుటుంబ మాయే ఉయ్యాలో

నిరుద్యోగులకు ఉయ్యాలో

నీడ దొర్కదాయే ఉయ్యాలో

తాగుబోతుల పాలనలో ఉయ్యాలో

పోరలంత తాగి చావబట్టే ఉయ్యాలో

చదువు యేమో ఉయ్యాలో

అందని ద్రాక్షాయే ఉయ్యాలో

రోగమొచ్చి మంచాన పడితే ఉయ్యాలో

ఉన్నదమ్ము కోవాలి ఉయ్యాలో

అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ఉయ్యాలో

కంట నీరు పెట్టించే ఉయ్యాలో

ఉచిత పథకాలు ఉయ్యాలో

ఉన్నోనికే అందబట్టే ఉయ్యాలో

ధరణి తెచ్చి ఉయ్యాలో

పైసలు దండుకునే ఉయ్యాలో

భూములన్నీ ఉయ్యాలో

పాలకుల పాలాయే ఉయ్యాలో

రైతుల చేతిలో ఉయ్యాలో

భూములే లేకపాయె ఉయ్యాలో

బంగారు తెలంగాణ చేస్తననే ఉయ్యాలో

ఇనుప తెలంగాణ చేసే ఉయ్యాలో

చేసిన అప్పులన్నీ ఉయ్యాలో

ఎవ్వరు కట్టాలి ఉయ్యాలో

ప్రజలను ఉయ్యాలో

మీ సావు మీరు సావండని ఉయ్యాలో

వైకుంఠ దామాలు కట్టే ఉయ్యాలో

మళ్ళీ ఓటు అడగబట్టే ఉయ్యాలో

ఓటెట్ల వేస్త ఉయ్యాలో

మీ ఇంటి లాగ ఉయ్యాలో

మా ఇల్లు లేదేమని అడుగుత ఉయ్యాలో

నారగొని ప్రవీణ్ కుమార్

సామాజిక కార్యకర్త

98490 40195

Next Story